‘గౌతమ్‌నంద’ స్టోరీ !!

‘రచ్చ’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు మరల్చుకున్న యువ దర్శకుడు సంపత్‌ నంది ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా ఫ్లాప్‌ అయినా కూడా వెంటనే గోపీచంద్‌తో ‘గౌతమ్‌నంద’ అనే చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కింది. వచ్చిన అవకాశంను వినియోగించుకుని భారీగా, ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ చిత్రాన్ని దర్శకుడు సంపత్‌ నంది తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో గౌతమ్‌ మరియు నందగా గోపీచంద్‌ కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

టీజర్‌ మరియు ట్రైలర్‌తో సినిమాలో గోపీచంద్‌ డబుల్‌ రోల్‌ అని అంతా భావిస్తున్నారు. అయితే చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గోపీచంద్‌ ఒకే పాత్రలో కనిపించబోతున్నట్లుగా తేలిపోయింది. ఇక సినిమా కథ వివరాల్లోకి వెళ్తే… లక్షల కోట్ల ఆస్తిపరుడి వారసుడిగా గోపీచంద్‌ కనిపిస్తాడు.

లక్షల కోట్లకు ఒకే వారసుడు అయిన హీరో మొదట బాగా పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. నెగటివ్‌ ఛాయలుకనిపించేలా ప్రవర్తిసాడు. అలాంటి వ్యక్తి ఒక కారణంగా ఆస్తులను అంతా కూడా పక్కకు పెట్టి ఇండియాలో ఒక సాదారణ జీవితాన్ని గడిపేందుకు సిద్దం అవుతాడు. ఆ సాధారణ జీవితం ఎలా సాగింది. దాంతో హీరో ఏం తెలుసుకున్నాడు అనేది సినిమా కథ. ఈ చిత్రంలో హీరోయిన్‌గా హన్సిక నటిస్తుంది. ఒక రాకుమార్తెగా ఆమె కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో 40 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసినట్లుగా తెలుస్తోంది. దిల్‌రాజు నైజాం ఏరియాలో ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగింది.

To Top

Send this to a friend