ఈ నెలాఖరుతో ఆ ఫోన్లలో వాట్పాప్ పనిచేయదు?

ఎన్నో లక్షల గ్రూపులు.. ఫ్యామిలీకి ఒకటి.. ఆఫీసు వాళ్లతో ఒకటి.. స్కూలు ఫ్రెండ్స్ తో ఒకటి.. వ్యాపారం కోసం మరొకటి.. ఇలా వాట్సాప్ మన నిత్యజీవితంలో నిత్యకృత్యమైపోయింది..ఇప్పుడు వాట్సాప్ లేకుండా ఉండలేని పరిస్థితి.. ఇన్నాళ్లు నెట్ ఉంటే చాలు ఫ్రీగా వాడేస్తున్నాం.. మన పనులను ఈజీగా చేసుకుంటున్నాం.. సమాచారాన్ని వేగంగా ఇచ్చుకుంటున్నాం.. వినియోగదారుల ఆదరాభిమానులను చూరగొన్న వాట్సాప్ ఇప్పుడు మరిన్ని ఆకర్షనీయ ఫీచర్లను జోడించే పనిలో పడింది. ఈ అప్ గ్రేడెడ్ వెర్షన్ పలు ఫోన్లలో రాదని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫేస్ బుక్ యాజమాన్యం వాట్సాప్ ను కొనుగోలు చేసిన తర్వాత కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే వీడియో కాలింగ్, స్టేటస్ ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారులకు మరిన్ని ఫీచర్లను అందించేందుకు రెడీ అయ్యింది.. ఈ అప్ గ్రేడెడ్ వెర్షన్ కొన్ని మొబైల్ డివైజ్ లలో పనిచేయకపోవచ్చునని జూన్ 30 తర్వాత వాట్సాప్ ఆ ఫోన్లలో పనిచేయదని ఒక ప్రకటనలో తెలిపింది.

జూన్ 30 తర్వాత అప్ గ్రేడెడ్ కొత్త వాట్సాప్ పనిచేయని డివైజ్ లు ఇవేనని యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది..
-బ్లాక్ బెర్రీ ఫోన్లలో..
-నోకియా ఎస్ 40
-నోకియా సింబియస్ ఎస్60
-ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2 వెర్షన్లలో పనిచేయదు..
-విండోస్ ఫోన్ 7.1
-ఐఫోన్ 3జీఎస్
-ఐవోఎస్ 6 ఫోన్లలో
*వాట్సాప్ జూన్ 30 తర్వాత పనిచేయదని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

To Top

Send this to a friend