ఫ్రెండ్ ఫ్రెండే.. పేకాట పేకాటే బాబూ..


ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంతో, మోడీతో ఎంత సన్నిహితంగా ఉన్న ఆయన వైఖరి చేష్టలపై ప్రధాని మోడీకి సందేహాలున్నాయా.? ప్రతిసారి కలిసి పథకాలపై నిధులు పట్టుకుపోతున్న చంద్రబాబు వాటన్నింటిని ఏం చేస్తున్నారనే దానిపై మోడీకి అనుమానం వచ్చిందా.? అందుకే కేంద్ర ప్రభుత్వంలోని ఇంజనీర్లు, అధికారులతో ఏపీ ప్రభుత్వ అభివృద్ధి పనులపై ప్రధాని మోడీ నిఘా పెట్టించారా.? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం లభిస్తోంది..

పోలవరంను జాతీయ ప్రోజక్ట్ గా ప్రకటించాలని మొదట టీడీపీ గోల చేసింది. ప్రధాని మోడీ ప్రకటించి 2 వేల కోట్లు మొదట ఇచ్చాడు. ఇప్పటికీ ఇస్తున్నాడు. మొదట ప్రకటించి పోలవరం అంచనాలు ప్రస్తుతం డబుల్ అయ్యాయి. పైగా జాతీయ ప్రాజెక్టు నుంచి వైదొలిగి చంద్రబాబు సర్కారే దీన్ని దగ్గరుండి నిర్మిస్తోంది. చంద్రబాబు స్వయంగా అడగడంతో మోడీ కాదనలేక పోలవరం బాధ్యతలను చంద్రబాబుకు ఇచ్చేశారట.. ఇక్కడే మోడీకి అనుమానం వచ్చింది.

ప్రతి రెండు నెలల కు పోలవరం అంచనాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు నిధుల కోసం అడుగుతూనే ఉన్నారు. దీంతో అనుమానం వచ్చిన మోడీ కేంద్ర జలసంఘా సభ్యుడు మన్సూర్ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారులు, నలుగురు ఇంజనీర్లతో కమిటీ వేశాడు. ఈ కమిటీ కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడుతోంది. ప్రాజెక్టు కోసమే ఖర్చు పెడుతున్నారా.? లేక పక్కదారి పడుతున్నాయా.? వంటి విషయాలను నిశితంగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు మోడీకి నివేదికలు పంపనుందట.. సో ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబును మోడీ నమ్మడం లేదని అర్థమవుతోంది. అనుమానాలున్నాయి కాబట్టే మోడీ ఇలా కమిటీ వేసి నిజాలు నిగ్గుతేలుస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

To Top

Send this to a friend