ఫారెస్ట్‌ అధికారుల కామదాహం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఇప్పపువ్వు కోసం అడవిలోకి వెళ్లిన గిరిజన మహిళపై అటవీశాఖ బేస్‌ క్యాంప్‌ సిబ్బంది అత్యాచారం చేశాడు. మండలంలోని బయ్యక్కపేట సమీపంలోని ముసలమ్మపెంట, గొత్తి కోయగూడాలకు చెందిన ముగ్గురు మహిళలు ఇప్ప పూల కోసం శుక్రవారం సాయంత్రం గూడెం దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అదే సమయంలో బేస్‌ క్యాంపులో పని చేస్తున్న మాలోతు సంతోష్‌, చింత విజయ్‌లు వారిని వెంటాడి అందులో ఓ మహిళను(22) పట్టుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారు.

పెనుగులాటలో అక్కడి నుంచి పరుగులు తీసిన మిగిలిన ఇద్దరు మహిళలు గూడెంలోకి వెళ్లి పెద్ద మనుషులకు సమాచారం ఇవ్వడంతో ఈ రోజు బాధితురాలి తల్లిదండ్రులు తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

To Top

Send this to a friend