ఫ్లిప్ కార్ట్ మెగా డీల్..

భారత దేశంలో ప్రస్తుతం నంబర్ 1 ఈ కామర్స్ దిగ్గజంగా ఉన్న అమెరికన్ ఆన్ లైన్ అంగడి కంపెనీ అయిన అమేజాన్ ను తట్టుకునేందుకు ఫ్లిప్ కార్ట్ భారీ అడుగు వేసింది. భారతదేశంలో ఈ కామర్స్ దిగ్గజం గా ఎదిగేందుకు ప్లిప్ కార్ట్ కు ఇది దోహదపడనుంది. ఫ్లిప్ కార్ట్ మరో ఈ కామర్స్ దిగ్గజం స్పాప్ డీల్ ను కొనుగోలు చేసేందుకు భారీ ఆఫర్ ను ఇచ్చింది. దీనికి స్నాప్ డీల్ కూడా ఓకే చెప్పడంతో ఇప్పుడు దేశంలోనే భారీ ఈ కామర్స్ దిగ్గజంగా ఫ్లిప్ కార్ట్ అవతరించనుంది.

స్నాప్ డీల్ ను చేజిక్కించుకునేందుకు ఫ్లిప్ కార్టు దాదాపు రూ.5175 కోట్లు ఆఫర్ చేసింది. దీనికి స్పాప్ డీల్ షేర్ హోల్డర్లు తటపటాయించారు. చివరకు 6175 కోట్లకు డీల్ ఓకే అయ్యింది. ఇంత మొత్తం చెల్లించి ఫ్లిప్ కార్ట్ … స్నాప్ డీల్ ను సొంతం చేసుకోనుంది. ఈ కొనుగోలు ప్రక్రియ దాదాపు ఓకే అయ్యింది.

నిధుల కొరతతో కటకటలాడుతున్న స్నాప్ డీల్ ను అమ్మేసేందుకు ఆ కంపెనీ షేర్ హోల్డర్లు, యజమానులు కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్లిప్ కార్ట్ ప్రయత్నాలు ఫలించాయి. ఈ డీల్ ను మూడు దశల్లో పూర్తి చేయనున్నారు. ఇది పూర్తయితే అమేజాన్ ను తోసిరాజని నంబర్ 1 ఆన్ లైన్ అమ్మకాల సంస్థగా ఫ్లిప్ కార్ట్ నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

To Top

Send this to a friend