ఫ్లిప్ కార్ట్ భారీ ప్లాన్

ఆన్ లైన్ పండుగ వచ్చింది. గ్రేట్ ఇండియన్ సేల్ అంటూ అమేజాన్ మే11-14వ తేదీల మధ్య, ఫ్లిప్ కార్ట్ మే 14-18ల మధ్య దేశీయ వినియోగదారులపై ఆఫర్ల వాన కురిపిస్తోంది. వివిధ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్, ఇలా అన్నింటిపై దాదాపు 40శాతం వరకు తగ్గింపు ధరలను ఈ వెబ్ సైట్లు ప్రకటించాయి. దీంతో ఇంత హాట్ సమ్మర్ లో ఆఫర్ల వానకు జనం తడిసిముద్దవుతున్నారు.

అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లు కొద్దిరోజులుగా దేశీయ ఆన్ లైన్ మార్కెట్ ను ఏలాలని పెద్ద ఎత్తున నిధుల సమీకరణ చేసి వినియోగదారులకు తక్కువకు వస్తువులను అందిస్తున్నాయి. ఇందులో ఫ్లిప్ కార్ట్ మొదటి స్థానంలో ఉండగా.. అమేజాన్ రెండో స్థానంలో ఉంది. కానీ అమెరికన్ అతిపెద్ద కంపెనీ అయిన అమేజాన్ మరింత భారీ డిస్కౌంట్ లతో మార్కెట్ ను షేక్ చేస్తోంది. ఎలాగైనా ఫ్లిప్ కార్ట్ ను రెండో స్థానంలోకి నెట్టాలని వరాల వాన కురిపిస్తోంది..

అమేజాన్ నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి ఫ్లిప్ కార్ట్ భారీ నిధుల సమీకరణకు ప్లాన్ చేసింది. దాంతోపాటు కునారిల్లుతున్న స్నాప్ డీల్ ను చేజిక్కించుకోవాలని చర్చలు జరుపుతున్నారట.. స్నాప్ డీల్ డైరెక్టర్లు కూడా ఫ్లిప్ కార్టు అమ్మడానికి ఆమోదం తెలిపారట.. త్వరలోనే స్నాప్ డీల్ అంతర్థానమై ఫ్లిప్ కార్ట్ లో కలిసిపోవడం ఖాయమని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.

To Top

Send this to a friend