కొత్తగూడెంలో ఫిష్‌ వెంకట్‌ రియల్‌ రౌడీయిజం

టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో విలన్‌గా, కమెడియన్‌గా నటించిన ఫిష్‌ వెంకట్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఈయన స్క్రీన్‌పై కనిపిస్తే నవ్వులు పూయిస్తూ ఉంటాడు. ఆ మద్య గబ్బర్‌సింగ్‌ సినిమాలో అంతాక్షరి ఎపిసోడ్‌లో ఫిష్‌ వెంకట్‌ది కీలక పాత్ర అని చెప్పవచ్చు. అలాంటి ఫిష్‌ వెంకట్‌ ఒక వివాదంలో చిక్కుకుని పోలీసు కేసులో బుక్‌ అయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఫిష్‌ వెంకట్‌ కూతురు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఉంటుంది. తాజాగా ఆమెకు అదే ఏరియాలో ఉండే ఒక కుటుంబంతో వివాదం అయ్యింది. దాంతో ఇరు కుటుంబాలు కొన్ని రోజులుగా గొడవలు పడుతూ ఉన్నారు. తాజాగా ఫిష్‌ వెంకట్‌ కొత్తగూడెం వెళ్లాడు. కూతురు విషయం చెప్పడంతో సదరు కుటుంబంపైకి ఫిష్‌ వెంకట్‌ అర్థ రాత్రి సమయంలో గొడవకు వెళ్లాడు. తన కూతురు జోలికి వస్తే ఊరుకోను అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు.

దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థ రాత్రి తాగి వచ్చి తమ ఇంటి వద్ద దాడికి దిగాడు. మాపై బౌతిక దాడికి కూడా ప్రయత్నించాడు అంటూ వారు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఫిష్‌ వెంకట్‌ను విచారించేందుకు సిద్దం అయ్యారు. తాను సినిమా విలన్‌ను అని మర్చిపోయి నిజంగా విలన్‌గా వ్యవహరించినందుకు గాను ఫిష్‌ వెంకట్‌పై ఇప్పుడు పోలీస్‌ కేసు నమోదు అయ్యింది.

To Top

Send this to a friend