పవర్ స్టార్ కి పవర్ తగ్గ లేదు


ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూ మరో పక్క సినిమాల్లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ కి ప్రేక్షకలోకం నీరాజనాలు పట్టడం మానలేదు. రెండేళ్ల గ్యాప్ తరవాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ఆ విషయాన్నీ ప్రూవ్ చేస్తోంది. .. ప్రముఖ నిర్మాత దిల్ రాజు , హిందీ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి సంయుక్తం గా నిర్మిస్తున్న పింక్ రీమేక్ చిత్రం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి దర్పణం కాబోతుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ట్విట్టర్  లో  మోత మోగిస్తోంది.   వకీల్ సాబ్ టైటిల్ తో రాబోతున్న ఈ  చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ]విడుదలైన 24 గంటల్లో 35 లక్షల ట్వీట్స్ సాధించి అల్ టైం రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు తమిళ నటుడు విజయ్ నటించిన బిగిల్ చిత్రం 29  లక్షల ట్వీట్ల తో ప్రధమ స్థానంలో ఉండగా దాన్ని బీట్ చేసి వకీల్ సాబ్ చిత్రం ప్రధమ స్థానంలో నిలిచింది. కాగా ప్రస్తుతం తెలుగు సినీ రంగం లో ఈ వార్త సంచలనం గా వైరల్ అవుతోంది.

To Top

Send this to a friend