బుల్లెట్‌’ సౌండ్‌ పై ఫైన్‌

కరీంనగర్‌: అతివేగంతో పాటు, కర్ణకఠోర శబ్ధాలతో దూసుకెళ్తున్న ద్విచక్రవాహనాలకు పోలీసులు కళ్లెం వేశారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తూ తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు విపరీతమైన శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న 16 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని వాహనదారులకు జరిమానాలు విధించారు. జిల్లా కేంద్రంలో గత కొంత కాలంగా ద్విచక్రవాహనాల శబ్ధ హోరు ఎక్కువవడంతో బుధవారం రంగంలోకి దిగిన పోలీసులు 16 మందికి జరిమాన విధించారు. పట్టుబడిన వాహనాలన్ని బుల్లెట్‌ బైక్‌లే కావడం విశేషం.

To Top

Send this to a friend