ఎట్టకేలకు డేట్‌ ఫిక్స్‌ అయ్యింది

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఎప్పటికప్పుడు ఆ సినిమా క్యాన్సిల్‌ అవుతూ, వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరిద్దరి కాంబోకు డేట్‌ ఫిక్స్‌ అయ్యిందని చెబుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమచారం ప్రకారం ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ ఇదే సంవత్సరం నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లబోతుంది. వచ్చే సంవత్సరం వేసవికి లేదా దసరాకు సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రాన్ని చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ ఆ సినిమాను నిర్మిస్తున్నాడు. రికార్డు స్థాయిలో ఈ చిత్రం వసూళ్లు సాధించడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. మూడు విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్‌ కనిపించబోతున్నాడు. మరో వైపు పవన్‌ కళ్యాణ్‌తో త్రివిక్రమ్‌ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ షురూ అయ్యే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈసారి వస్తున్న వార్తలు నిజం అయ్యేలా కనిపిస్తున్నాయి. నిర్మాత రాధాకృష్ణ ఈ విషయాన్ని అనధికారికంగా చెప్పుకొచ్చాడు. దాంతో ఈ క్రేజీ కాంబో మూవీ పట్టాలెక్కడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.

To Top

Send this to a friend