బిగ్ బాస్ లో రక్తం కారేలా కొట్టుకున్నారు..

ఇంటి కెప్టెన్ ను తేల్చే టాస్క్ బిగ్ బాస్ లో ఉద్రిక్తతలకు దారితీసింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన ‘గుడ్ల టాస్క్’లో సెలబ్రెటీలు కొట్టుకున్నారు.ముమైత్ ఖాన్ కు శివబాలాజీ, ధన్ రాజ్ లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ముమైత్ ఖాన్ కు, నవదీప్ మధ్య కెప్టెన్ ఎవరనేది నిర్ణయించే గుడ్ల గేమ్ ను బిగ్ బాస్ పెట్టారు. ప్రిన్స్, ఆదర్ష్ ఎంత ప్రయత్నించిన నవదీప్ వద్దనున్న కోడిగుడ్లను పగుల కొట్టలేకపోయారు. ఇక ముమైత్ ఖాన్ దగ్గర ఉన్న కోడిగుడ్లను శివబాలాజీ ఒక్కడే దూసుకువచ్చి ఆమె మీద పడి కోడిగుడ్లన్నింటికి పగులకొట్టాడు. ఈ సందర్భంగా ముమైత్ ఖాన్ కు, శివబాలాజీ మధ్య పెనుగులాట జరిగింది. ఇందులో ముమైత్ ఖాన్ టీంలో ప్రిన్స్, ఆదర్ష్, హరితేజ, అర్చన ఉండగా.. నవదీప్ టీంలో శివబాలాజీ, కత్తి కార్తీక, దీక్ష, ధన్ రాజ్ లున్నారు. వీరి తమ దగ్గర ఉన్న కోడిగుడ్లను పగులకుండా చూసుకోవాలి.

ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇంటిలోని ఓ అద్ధం పగిలిపోయింది. ఆ అద్దం పెంకులు తగిలి నవదీప్ కు, అర్చనకు కాళ్లకు గాయాలయ్యాయి. రక్తం పారింది. అర్చనను వైద్యులు వచ్చి చికిత్స చేసి కాలికి పట్టి కట్టారు. చివరకు ఇలా రెండు జట్లుగా విడిపోయి తలపడ్డ గుడ్ల టాస్క్ లో నవదీప్ టీం విజయం సాధించింది. ముమైత్ ఖాన్ టీం ఓడిపోయింది.. తదుపరి వారం ఇంటి కెప్టెన్ గా నవదీప్ ఎన్నికయ్యారు.

To Top

Send this to a friend