అయ్యన్న, గంటా ఫైట్.. చంద్రబాబుకు తలనొప్పి..


విశాఖలో టీడీపీ నేతల భూమాయ ఇటీవల పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు రావడంతో టీడీపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ భూమాయపై ఆరా తీసింది. అయితే దీని వెనుక టీడీపీ మంత్రి  గంటా శ్రీనివాసరావు ఉన్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విశాఖకే చెందిన మరో మంత్రి అయ్యన్నపాత్రుడు… మంత్రి గంట పై విమర్శలు చేశారు. అయ్యన్న తీరుప ఆగ్రహం వ్యక్తం చేసిన గంటా ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం సంచలనంగా మారింది.

ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఇరుకునపెడుతున్న అయ్యన్నపాత్రుడి వైఖరి నష్టం చేకూరుస్తోందని.. విశాఖ భూ కుంభకోణంలో టీడీపీ నాయకుల పాత్ర ఉందని అయ్యన్న మీడియా ముందుకు వచ్చి చెప్పడంపై గంటా లేఖ రాసి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

ఇలా ఇద్దరు మంత్రులు భూ కుంభకోణంలో ఆరోపణలు చేసుకోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది. విశాఖ భూకుంభకోణం వెనుక మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నాడనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. టీడీపీ మంత్రియే ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

To Top

Send this to a friend