కళామందిర్ వారి ఫ్యాషన్ డిజైనర్ ట్రైలర్

ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ అనేది సీనియర్ దర్శకులు వంశీ దర్శకత్వంలో ఈ జూన్ 2 కి రాబోతున్న సినిమా. కళామందిర్ అనేది సుప్రసిధ్ధ శారీ బ్రాండ్. ఈ రెండింటికీ సంబంధం ఏంటి? కళామందిర్ వారి ఫ్యాషన్ డిజైనర్ ట్రైలర్ ఏంటి? అక్కడికే వస్తున్నాం.
మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో వంశీ దర్శకత్వంలో వస్తున్న “ఫ్యాషన్ డిజైనర్ సన్నఫ్ లేడీస్ టైలర్” చిత్రంలో నటించిన సుమంత్ అశ్విన్, అనీష అంబ్రోస్, రాఘవేంద్ర లు తాజా కళామందిర్ యాడ్లో నటించారు…కాదు కాదు తాజా ఫ్యాషన్ డిజైనర్ ట్రైలర్లో కళామందిర్ షోరూమే నటించింది…ఇది ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్…కాదు కాదు ఫిల్మ్-ఇన్ బ్రాండింగ్. సరే ఏదైతేనేం? అటు సినిమా నిర్మాతకి, ఇటు కళామందిర్ యజమానులకి నచ్చేసింది. ఇలా మీ ముందుకు వచ్చేసింది.
ఇంతకీ ఏమిటిది? కళామందిర్ యాడ్డా, ఫ్యాషన్ డిజైనర్ ట్రైలరా? చూసి మీరే తేల్చుకోండి.
సినిమా ప్రచారాన్ని వినూత్నంగా చేయడానికి ఇష్టపడే నిర్మాత మధుర శ్రీధర్ ఈ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఈ సీన్ సినిమాలో ఉన్నదా లేక పబ్లిసిటీ కోసం చేసిందా అని అడిగితే “వేచి చూడండి” అంటున్నారు నిర్మాత.

To Top

Send this to a friend