‘ఆరుద్ర’ వచ్చిందోచ్.. రైతన్న ఆనందం..


అరుద్ర పురుగులు.. ఇప్పటి తరానికి ఇవేవో తెలియదు.. కానీ పల్లెటూళ్లో ఉండే పెద్దవారికి ఓ 30 ఏళ్లు పైబడిన వారందరికీ ఆ పురుగులు ఏంటో అవి తీసుకొచ్చే మెసేజ్ ఎంటో స్పష్టం గా తెలుసు..

ఎర్రగా ఉండే పురుగునే ఆరుద్ర పురుగు అంటారు. ఇవి రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి. వీటిని ఏ రైతు చంపడు.. ఎవ్వరినీ చంపనీయడు.. దేవతలకు , వరుణ దేవుడికి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు.. కొలుస్తారు..

అలాంటి ఆరుద్ర పురుగులు వర్షాలు బాగపడి కాలమవుతుందనుకుంటేనే మనుషులకు కనిపిస్తాయి. ఈ పరుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు సంతోషంతో గంతులేస్తారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం సంవృద్ధిగా వర్షాలు పడుతాయని సంకేతం.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుతాయనే ధీమా రైతుల్లో నెలకొంటుంది.

అప్పట్లో వరుస కరువులు ఉన్నప్పుడు ఈ పురుగుల జాడేలేదు. గడిచిన రెండేళ్ల క్రితం వరకు కూడా లేదు. పోయినేడాది., ఈ సంవత్సరం అరుద్ర పురుగులు మనకు కనిపిస్తున్నాయంటే ఈసారి కాలమైనట్టే లెక్క.. ‘అరుద్ర’తో రైతుల క ళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

To Top

Send this to a friend