ఫ్యాన్స్ కు రేపు పండుగ


మహేశ్ బాబు తన ఫ్యాన్స్ కు రేపు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాడు. దిగ్గజ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి పోస్టర్ కానీ.. లుక్ కానీ టీజర్ కానీ విడుదల కాలేదు. కానీ ఈనెల 12న రేపు మహేశ్ సినిమాకు సంబంధించి తొలి ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి చిత్ర బృందం సమాయత్తమైంది.

మహేశ్-మురగదాస్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు సినిమా పేరును ఖరారు చేయలేదు. మొదట ఈ సినిమాకు ఏజెంట్ శివ అని అనుకున్నారు. ఆ తర్వాత సంభవామి అనే పేరును అనుకున్నారు. ఇప్పుడు ‘స్పైడర్’ పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రేపు విడుదల కానున్న మహేశ్ సినిమా లుక్ కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

బ్రహ్మోత్సవం దారుణ పరాజయంతో మహేశ్ తీవ్రంగా కలతచెందారు. అందుకే ఇక తెలుగు సినిమా దర్శకుల కథలను ఒప్పుకోలేదు. చాలామంది వినిపించినా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో పూరి, శీను వైట్ల లాంటి దర్శకులు కథలు వినిపించినా ఒప్పుకోలేదు.. చివరకు టాప్ దర్శకుడైన మురగదాస్ కథకు ఓకే చెప్పారు. ఇప్పుడు మహేశ్ ఆశలన్నీ మురగ సీనిమా పైనే.. తెలుగు, తమిళం, హిందీల్లో విడుదల చేసే సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

To Top

Send this to a friend