లేఖలో బలాయ్యను కడిగేసిన అభిమాని

బాలయ్య తన 102 వ సినిమా ప్రారంభోత్సవ సందర్బంగా తన అసిస్టెంట్ ఫై చేయి చేసుకున్నారు.. ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.. బాలయ్య తన షూ విప్పమంటూ అసిస్టెంట్ ను కొట్టారు.. ఈ దృశ్యాన్ని వీడియో లో బంధించి మీడియాలో వదిలారు.. ఇంకా అంతే బాలయ్యకు అభిమానులు ఘాటుగా సమాధానం చెప్పారు.. అయితే ఈ రోజు బాలయ్యను ప్రశ్నిస్తూ రాసిన ఓ లేఖ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.. పైసా వసూల్ సినిమా లోని బాలయ్య డైలాగ్ ను అనుకరిస్తూ “అన్నా…. రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా” అంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ఆ లేఖ లో ఏం రాశారంటే..

“అన్నా…. రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా ”

దొరలు, రాజులు, రాచరిక వాదులకాలం
పోయి శానా కాలమైంది.
ఇది ప్రజాస్వామ్యం ఇంకా
మీరు దొరల్లా ఫీల్ అవకండి.
పొగరు దరి చేరనంత వరకే ఏ కళకైనా విలువ.
ఒక కళాకారుడైన మీకు ఇది తగదు.
సారూ మీపై ఆధార పడి ఎవరూ బతకట్లేదు
మీరే ప్రజలపైన, అభిమానులపైన ఆధార పడి బతుకుతున్నారు.
మీ బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష.
ప్రేక్షక దేవుళ్ళని ఊరికే అనలేదు.
పరిశ్రమ మొత్తం సామాన్యుడు చింపిన
టికెట్ చప్పుడుపైనే ఆధారపడి ఉంది.
రేపు నీ సినిమాని మేం బహిష్కరించాం అనుకో.
VIP లో ఓ అక్షరం మిస్ అయ్యే పరిస్థితి నీది.
తెలుగు తెలుగు తెలుగు అని
మాటి మాటికి ఉచ్చరించే మీరు
మనుష్యుడే నా సంగీతం
మానవుడే నా సందేశం
అన్న ఆ తెలుగు మహాకవి మాటలు వినుంటే
ఈరోజిలా సాటి మనిషిని నీ చెప్పులు

తాకమని చేయి చేస్కోవు.
అతడు పనివాడే కావొచ్చు
కానీ ఒక మనిషేనని గుర్తుంచుకోండి
నువ్వు ఎంత గొప్ప వాడివైనా కావొచ్చు
సాటి మనిషి మాత్రం
నీ చెప్పులు తుడిచే బానిస కాదు.
ఆడది కనబడితే కడుపు చేయమంటావ్
మగాడు కనబడితే చెప్పులు తాకమంటావ్
ఫోటో దిగితే ఫోన్ పగలగొడతావ్
ఫోన్ చేస్తే బూతులు మాట్లాడ్తావ్
21 వ దశాబ్దంలో
70 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కూడా
కులం కంపు
జాత్యహంకార కంపు
ధనాహంకార కంపు
కొడుతోంది.
ధన బలం, అధికార బలంతో
రమించిన మీ ప్రవర్తన
బురదలో బొర్లే పంది వలే
వెర్రి తలలు వేస్తుంది.”

To Top

Send this to a friend