‘డీజే’ ట్రైలర్‌ వ్యూస్‌ ఫేక్‌.. అది సాధ్యమా?

ఒక సంవత్సరం ముందు వరకు తెలుగు సినిమా టీజర్‌ లేదా ట్రైలర్‌ యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుంది అంటే దుమ్ము దుమ్ము అంటూ ఫ్యాన్స్‌ గొప్పలు చెప్పుకునే వారు. ఇక రెండు మిలియన్‌లు వచ్చాయి అంటే రికార్డులు బద్దలుగా చెప్పుకునే వారు. కాని ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. ఒక ట్రైలర్‌ లేదా టీజర్‌ మినిమం పది మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. కోటి వ్యూస్‌ ప్రస్తుతం కామన్‌, కాని అది ఎంత సమయంలో ఆ పది మిలియన్‌ల వ్యూస్‌ను రాబడుతుంది అనేది ఫ్యాన్స్‌లో చర్చ జరుగుతుంది.

అల్లు అర్జున్‌ తాజాగా నటించిన ‘డీజే’ చిత్రం ట్రైలర్‌ యూట్యూబ్‌లో కేవలం రెండు రోజుల్లో కోటి వ్యూస్‌ను సొంతం చేసుకుంది ఈ స్థాయిలో వ్యూస్‌ను రాబట్టిన చిత్రంగా ‘బాహుబలి’ తర్వాత ‘డీజే’ నిలిచింది. స్పైడర్‌ టీజర్‌ను మించి డీజే దూసుకు వెళ్తుండటం చూసి కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్‌ నిజంగానే ఆ స్థాయిలో క్రేజ్‌ను కలిగి ఉన్నాడా, లేక ఆయన అభిమానులు ఏమైనా చీటింగ్‌ చేస్తున్నారా అంటూ యాంటీ ఫ్యాన్స్‌ అనుమానంగా అంటున్నారు.

ఈ అనుమానాలను యూట్యూబ్‌ ఎక్స్‌పర్ట్స్‌ కొట్టి పారేస్తున్నారు. యూట్యూబ్‌లో ఫేక్‌ వ్యూస్‌కు ఛాన్స్‌ ఉండదని, యూట్యూబ్‌ చాలా సీరియస్‌గా ఫేక్‌ వ్యూస్‌ గురించి జాగ్రత్తలు తీసుకుంటుందని, ఒక్క ఐపీ నుండి ఎక్కువ సార్లు వ్యూస్‌ వచ్చినట్లయితే అనుమానం కలుగుతుంది. దాంతో అప్పుడు చర్యలు తీసుకుంటుంది. గతంలో బాహుబలికి ఫేక్‌ వ్యూస్‌ వచ్చాయంటూ యూట్యూబ్‌ కొంత సయమం ట్రైలర్‌ను తొలగించిన దాఖలాలు ఉన్నాయి. అందుకే ‘డీజే’ వ్యూస్‌ నిజమే అయ్యి ఉంటాయి అంటున్నారు.

To Top

Send this to a friend