మనుషుల్ని మాయం చేసే దేవుడి పర్వతం

మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మానస మేథస్సుకు ఇసమంతైనా అర్థంకాని రహస్యాలు ఎన్నోఈ పర్వతంపై దాగి ఉన్నాయి.సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయా పర్వత శ్రేణుల్లో ఆ పర్వతం ఉంది. అదే కైలాస పర్వతం (మౌంట్ కైలాస్). ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారని హిందువులు నమ్ముతారు.. ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, కర్నాలి (గంగానదికి ఉపనది) మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతిభక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం, వినాయక, కుమారస్వామి, నంది ల దర్శనం కలుగుతుంది.కైలాస పర్వత పాదపీఠంలో నెలకొని ఉన్న మానస సరోవరం మరో అపురూపం.అత్యద్భుతం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. బ్రహ్మీ ముహుర్తంలో అంటే ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. ఈ ముహూర్తంలో కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి.

అయితే 900 ఏళ్లుగా ఆ పర్వతాన్ని ఎవ్వరూ ఎక్కలేదు. ఎక్కడానికి ప్రయత్నించిన వారు మధ్యలోనే అదృశ్యమయ్యారు. ఆ పర్వత విశేషాలను చూడడానికి వెళ్లిన వారు సన్యాసులుగా మారిపోతున్నారట.. కొందరు చైనీయులు ధైర్యం చేసి పర్వత ఎక్కగా అదృశ్యమైపోయారు. వారి దేహాలు కూడా ఇప్పటికీ లభ్యం కాలేదట. అందుకే చైనా ప్రభుత్వం ఇప్పుడు ఆ పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేధించింది.

To Top

Send this to a friend