ఫేస్ బుక్/వాట్సప్ పిచ్చి పీక్ స్టేజ్ కి..


అర్ధరాత్రి ఒకటి, రెండు గంటలవుతోంది. అయినా ఫేస్ బుక్, వాట్సప్ లోచాటింగ్ కొనసాగుతోంది.. దీంతో తెల్లవారి  లేవడం బద్దకమవుతోంది. కాలేజ్ కి వెళ్తే నిద్ర ముంచుకొస్తోంది. పాఠాలు బుర్రకెక్కడం లేదు. చదువుకు మీద ధ్యాస నిలవడం లేదు. దీంతో పరీక్షల్లో సరిగ్గా రాయలేక ఫెయిల్ అయిపోతున్నారు. ఈ మధ్య యువతను సోషల్ మీడియా జాఢ్యం విపరీతంగా ప్రభావితం చేస్తోందని.. వారి జీవితాలను అతలాకుతలం చేస్తోందని ఓ సర్వేలో తేల్చారు.

ప్రస్తుతం సెల్ ఫోన్ ఫోబియా యువతను, ఉద్యోగులను ఆవహించింది. వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మధ్యమాల్లో అర్థం పర్థం లేని పోస్టులకు స్పందిస్తూ.. అమూల్యమైన సమయాన్ని వృథా చేస్తున్నారు. ఈ జాఢ్యం మితిమీరిపోవడం వల్ల మానసిక ఆందోళన , కృంగుబాటు.. చేసే పనిమీద ధ్యాస కరువవుతోందని సర్వేల్లో తేలింది. రాత్రి పొద్దుపోయేదాకా చాట్ చేస్తుండడంతో ఉదయమే నిద్ర లేవడం కష్టమవుతోంది. త్వరగా లేచినప్పుడు నిద్రలేమితో తలనొప్పి తీవ్రమవుతోంది. దీంతో ఆ రోజంతా ఏదో తెలియని వెలితి మనిషిని ఆవహిస్తోంది..

రాత్రి సరిగ్గా 8 గంటలోపు తినేస్తే అందిరికీ మంచిది. రాత్రి పదిలోపు బెడ్ మీదకు వెళ్లాలి.. సెల్ ఫోన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.. అర్జెంట్ కాల్స్ వస్తే తప్ప మాట్లాడవద్దు.. ఫేస్ బుక్, వాట్సాప్ లలో రాత్రి పూట చాట్ ను చూడడం కూడా చేయకపోతే మరీ మంచిది. దానివల్ల ఏం ప్రయోజనం లేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. ఒత్తిడి.. ప్రయాస , నిద్రలేమికి దూరంగా ఉండాలంటే ఈరోజు నుంచే యువత ఈ కఠిన మైన నిర్ణయం తీసకొని రాత్రి పూట సెల్ ఫోన్ దూరంగా పెడితే వారి భవిష్యత్తుకు మంచిదని సూచిస్తున్నారు నిపుణులు..

To Top

Send this to a friend