పవన్-రేణులు కలిసిపోండి..

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఈ మధ్య సోషల్ మీడియా ఫేస్ బుక్ లో రాసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. రేణు ఖాతాలో ఇటీవల కొందరు పవన్ అభిమానులు చేసిన పోస్టులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.. ఆ పోస్టులపై స్పందించిన రేణు ఉద్వేగంగా సమాధానమిచ్చారు.

కొందరు పవన్ ఫ్యాన్స్ పవన్-రేణు దేశాయ్ లు కలిసి జీవిస్తే చూడాలని ఉందని కాంట్రవర్సీ పోస్టులు పెట్టారు. దీనికి రియాక్ట్ అయిన రేణు తన ఫేస్ బుక్ ఖాతాలో ఇలా రాసుకొచ్చింది.. ‘నా వ్యక్తిగత జీవితం గురించి అందరికీ విజ్ఞప్తి.. నేను రేణుదేశాయ్ భార్యను కాను. నాలుగేళ్ల క్రితమే పవన్ ‘ఆనా’ను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ఒక కూతురు కూడా.. నేను పవన్ స్నేహితులం మాత్రమే.. దయచేసి అభిమానులు రేణుదేశాయ్, పవన్ మళ్లీ కలిసిపోవాలని పదే పదే కోరవద్దు.. కళ్యాణ్ భార్యగా ‘ఆనా’నే ఉంటుంది. నేనుండను.. నా పిల్లలకు పవన్ తండ్రి, మేమిద్దరం స్నేహితులం మాత్రమే.. మరోసారి నన్ను పవన్ ను కలవమని ఒత్తిడి తేవద్దు.. మేము ఎప్పటికీ భార్యభర్తలం కాలేము.. ’ అంటూ రేణుదేశాయ్ ఉద్వేగంగా అంతరంగాన్ని ఆవిష్కరించింది..

రేణుదేశాయ్ ఒక్కటి మాత్రం స్పష్టం చేసింది. తాను, పవన్ ఇక కలిసి జీవించేది ఈ జన్మకు లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను కొట్టిపారేసింది. కనీసం పిల్లల కోసమైనా కలవండని పవన్ ఫ్యాన్స్ చేసిన కోరికను సున్నితంగా తిరస్కరించింది.

To Top

Send this to a friend