పాతనోట్లు మార్చుకోవచ్చు..


పాతనోట్లు మార్చుకునే అవకాశాన్ని మరోసారి కేంద్రం కల్పించింది. మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోని సహకార బ్యాంకుల్లో వేలకోట్ల పాత నోట్లు మూలుగుతున్నాయి. ఇవన్నీ రైతులకు సబ్సిడీ కింద ఇచ్చే రుణాలు కావడంతో రైతులకు ఇవ్వడం సాధ్యం కావడంలేదు. ఒక్కో బ్యాంకు వద్ద ఇలా పేరుకుపోయిన డబ్బులన్నింటిని ఆర్బీఐ శాఖల్లో మార్చుకోవాలని ఆర్థిక శాఖ సైతం ప్రకటనలో తెలిపింది. అయితే ఈ రద్దయిన నోట్లను కేవలం బ్యాంకులు మార్చుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. సామాన్యులు, వ్యాపారులు మార్చుకోవడానికి చాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం.

ఇప్పటికే దేశవ్యాప్తంగా బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పెద్ద ఎత్తున పాతనోట్లు జమ చేసి ఉన్నాయి.. మార్చి 31 వరకే రిజర్వ్ బ్యాంక్ శాఖల్లో జమచేయడానికి వీలు కల్పించారు. కానీ పెద్ద ఎత్తున పేరుకుపోయిన పాతనోట్లకు సరిపడా కొత్త నోట్లు లేకపోవడంతో ఆర్బీఐ శాఖలు పాతనోట్లను చాలా బ్యాంకుల నుంచి తీసుకోలేదు. కానీ ఇప్పుడు పేరుకుపోయిన డబ్బుల వల్ల ప్రభుత్వాలకు, సహకార బ్యాంకులు రైతులకు ఇచ్చే పరిహారాన్ని ఆపివేశాయి. దీంతో ప్రభుత్వాలు కేంద్రం, ఆర్బీఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాయి.

బ్యాంకుల్లో పేరుకుపోవడం రైతులకు పరిహారంలో జాప్యంపై కేంద్రం, ఆర్బీఐ స్పందించింది. రద్దయిన నోట్లను తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంకు మరోసారి చాన్స్ ఇచ్చింది. ఈ పాత నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 30 రోజుల్లోగా ఏ ఆర్బీఐ బ్రాంచిలోనైనా జమ చేసుకొని కొత్త నోట్లు తీసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.

To Top

Send this to a friend