ఎర్రబెల్లి అలక.. కేటీఆర్ రాయబారం..


పాపం ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీడీపీలో ఓ వెలుగు వెలిగాడు. టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కీరోల్ పోషించాడు. కేసీఆర్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అనంతరం ప్రజాభిమానం టీఆర్ఎస్ కే ఉందని తెలిసి గులాబీ పార్టీలో చేరారు. చేరిన కొత్తలో కేసీఆర్ తో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి ఈ మధ్య అస్సలు కేసీఆర్ ను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలవకుండా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నారు..

ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా అటెండెన్స్ కోసం అలా వచ్చి ఓ 5 నిమిషాలు ఇలా కూర్చొని కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలను పలకరించకుండా ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో ఈ విషయం తెలిసిన టీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యంగా కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఈరోజు మధ్యాహ్నం నేరుగా ఎర్రబెల్లి ఇంటికి వెళ్లి సముదాయించారట.. గంటకు పైగా చర్చలు సాగాయి..

అసలు విషయం ఏంటంటే టీడీపీనుంచి టీఆర్ఎస్ లో చేరినప్పుడే కేసీఆర్ వరంగల్ నుంచి ఎర్రబెల్లికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారట.. ఇప్పుడా విషయం మరిచిపోవడం.. కనీసం ఎర్రబెల్లి తల్లి ఇటీవల మరణించినా పరామర్శించకపోవడంతో కేసీఆర్ పై కినుక వహించి ఎర్రబెల్లి ఇలా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. దీంతో మంత్రి కేటీఆర్ వెళ్లి ఇలా రాయబారం నడిపాడు. మరి ఎర్రబెల్లి కరిగిపోయాడా లేదా అన్నది తేలాల్సి ఉంటుంది.

To Top

Send this to a friend