సోనియా, రాహుల్ పై దర్యాప్తు.


బీజేపీ నేత , రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటీషన్ లో సోనియా, రాహుల్ లకు ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టులో వీరికి షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను అక్రమంగా సోనియా, రాహుల్ సొంతం చేసుకున్నారని.. యంగ్ ఇండియా ద్వారా నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని… దాదాపు 2వేల కోట్ల ఆస్తులు కొల్లగొట్టారని సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. దీనిపై హైకోర్టు సోనియా, రాహుల్ లపై దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించింది.

వెంటనే యంగ్ ఇండియా- నేషనల్ హెరాల్డ్ ఆస్తులపై ఆదాయపు పన్ను డాక్యుమెంట్లను సమర్పించాలని హైకోర్టు.. సోనియా, రాహుల్ లను ఆదేశించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో సోనియా, రాహుల్ లు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు. ఆస్తులు తమవే అని నిరూపించుకునేందుకు మంచి లాయర్ తో సుప్రీంకు అప్పీల్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

To Top

Send this to a friend