ఎండకాలంలో చర్మ సౌందర్యానికి చిట్కాలు

వేసవి తీవ్రత బాగా పెరిగింది. అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా నష్టపోయే శరీర అవయవాల్లో చర్మం ప్రధానమైంది. ఎండ కారణంగా మరీ ముఖ్యంగా ముఖం నల్లబడుతుంది. నిర్జీవంగా తయారవుతుంది. ముఖం బయటికి చూపించుకోలేక సన్ ట్యాన్ ట్రీట్మెంట్ల పేరిట వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. కాని కింద చెప్పిన విధంగా చేస్తే ఖర్చు ఏమీ లేకుండానే చర్మం తిరిగి మేలిమి ఛాయతో తెల్లగా అవడమే కాకుండా నున్నగా మెరుస్తుంది. కింద చెప్పిన విధంగా కనీసం వారానికి మూడు సార్లు తప్పనిసరిగా చేస్తే చర్మంలో మంచి గ్లో వస్తుంది. ఇంతకూ ఏం చేయాలో కింద తెలుసుకోండి..

టిప్1:
ముందు కొన్ని చల్లని పచ్చి పాలు తీసుకోవాలి. దానిలో నిమ్మరసం, ఒకే ఒక చుక్క తేనే వేసుకుని కలుపుకుని ఆ పేస్టుని ముఖానికి మెడకు రాయాలి. ఇలా రాసిన తరువాత చల్లని నీటితో కడిగితే ముఖం మీద నలుపు పోతుంది
టిప్2:
పచ్చిపాలల్లో (చల్లని పాలు) కొద్దిగా శనగపిండి, పసుపు వేయాలి. కొద్ది జారుగా పేస్టు చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ఆరిపోయాక వేళ్ళను కొద్దిగా పాలతో తడిపి మర్దన చేసుకుంటూ ఒక 5 నిమిషాల తరువాత కడగాలి.
టిప్3:
కొద్దిగా తేనే నిమ్మరసం కలిపి ముఖానికి కొద్దిగా మందంగా రాసుకోవాలి. ఆరిపోయిన తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తూ ఉంటే చర్మం పూర్తిగా తెల్లగా అవ్వడమే కాకుండా మంచి నిగారింపు వస్తుంది..

To Top

Send this to a friend