సన్నీతో రెచ్చిపోయిన ఇమ్రాన్‌

 

బాలీవుడ్‌లో రొమాంటిక్‌ పాత్రలకు పెట్టింది పేరైన ఇమ్రాన్‌ హష్మి తాజాగా అజయ్‌ దేవ్‌గన్‌ హీరోగా నటించిన ‘బాద్‌షాహో’ అనే చిత్రంలో ముఖ్య పాత్రను పోషించాడు. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌లో అజయ్‌ దేవ్‌గన్‌, హీరోయిన్‌ ఇలియానాల రొమాన్స్‌ ఒక ఎత్తు అయితే అంతకు మించి ఇమ్రాన్‌ హష్మి మరియు సన్నీలియోన్‌ల రొమాన్స్‌ ఉంది.

సినిమాలో వీరిద్దరి రొమాన్స్‌ హైలైట్‌ అయ్యేలా సీన్స్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. పోర్న్‌ స్టార్‌గా మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న సన్నీలియోన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ పాత్రల్లో నటిస్తుంది, ఇక మరో వైపు రొమాంటిక్‌ సీన్స్‌ను చేయడంలో దిట్ట అయిన ఇమ్రాన్‌. వీరిద్దరి కలయిక ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండి తెర హీట్‌ ఎక్కి యూత్‌ ఆడియన్స్‌ హృదయాలు బద్దలు కావాల్సిందే అని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. వీరి రొమాన్స్‌ను చూడాలి అంటే సెప్టెంబర్‌ 1 వరకు ఆగాల్సిందే. భారీ ఎత్తున బాద్‌షాహో చిత్రాన్ని సెప్టెంబర్‌ 1న విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.

To Top

Send this to a friend