జగన్ కు షాకే.. ఏపీలో టీడీపీ, తెలంగాణ టీఆర్ఎస్ దే..

దేశవ్యాప్తంగా ప్రముఖ సర్వే సంస్థ ‘వీడీపీ అసోసియేట్స్’ నిర్వహించిన ఎన్నికల సర్వే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై వీడీపీ సర్వే చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిషా, కర్ణాటక, బీహార్ , పశ్చిమ బెంగాల్ తదితర ప్రముఖ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారో సర్వేలో వివరించింది..

*ఆంధ్రప్రదేశ్ లో..
ఏపీలో ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీ-బీజేపీ కూటమికే అధికారం అని వీడీపీ సంస్థ  తేల్చిచెప్పింది. టీడీపీ-బీజేపీకి 47శాతం ఓట్లు వస్తాయని.. ప్రతిపక్ష వైసీపీ పార్టీకి 40శాతం ఓట్లు వస్తాయని స్పష్టం చేసింది. ఈ లెక్కన ప్రతిపక్ష వైసీపీ మరోసారి ప్రతిపక్షానికి పరిమితమైపోవడం ఖాయమని తేల్చింది. ఇక ఏపీలో దూసుకొస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు కేవలం 3శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే నిగ్గు తేల్చింది. కాంగ్రెస్ కు కూడా జనసేన అంతే 3శాతం ఓట్లు వస్తాయని స్పష్టం చేసింది. ఇక ఏపీలో ఏ పార్టీకి ఓటు వేయకుండా తటస్థంగా ఉండే వారి శాతం 7కు పైగా ఉందని వారంతా ఎన్నికల సమయానికి ఏ పార్టీకైనా ఓటు వేయవచ్చని తేల్చింది.

*తెలంగాణలో కారు జోరే..

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన స్టామినా కొనసాగిస్తున్నారు.. తెలంగాణలో కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేని ఆధిక్యం వస్తుంది.. టీఆర్ఎస్ కు 47శాతం వస్తాయని సర్వే తేల్చింది. ఇక ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కు కేవలం 23శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తేలింది. వచ్చేసారి కాంగ్రెస్ కు ప్రతిపక్షమే దిక్కని నిరూపితమైంది. ఇక బీజేపీ-టీడీపీ కూటమికి 19శాతం ఓట్లు వస్తాయని తేల్చారు. ఎంఐఎం, ఇతర పార్టీలకు కలిపి 7శాతం ఓట్లు వస్తాయని తేల్చారు. ఇక తెలంగాణలో కేసీఆర్ ను ఓడిస్తామని కలలు గంటున్న కాంగ్రెస్, టీడీపీలకు ఈ ఫలితాలు ఆశనిపాతంలా మారాయి.

*మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే..
*ఒడిషాలో హైట్రిక్ విజయాలతో ఉన్న బీజేడీ ప్రభుత్వం ఈసారి ఓడిపోక తప్పదని సర్వే తేల్చింది. సీఎం నవీన్ పట్నాయక్ పార్టీకి కేవలం 36శాతం ఓట్లు వస్తాయని తేల్చారు. స్తానిక సంస్థల ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించిన బీజేపీకి ఒడిషాలో 42శాతం ఓట్లు వచ్చి అధికారం దక్కుతుందని సర్వే తేల్చింది.
*పశ్చిమబెంగాల్ లో మమతదే అధికారం.. తృణమూల్ కు 46శాతం, బీజేపీకి 28, వామపక్షాలకు 12శాతం వస్తాయని తేల్చారు.
*తమిళనాడులో అధికార అన్నాడీఎంకే-బీజేపీ ఓటమి తథ్యమని సర్వే తేల్చింది. అన్నాడీఎంకే కూటమికి 33శాతం.. ప్రతిపక్ష డీఎంకేకు 37శాతం ఓట్లు వస్తాయని తేలింది..
*బీహార్ లో మాత్రం హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయి. అక్కడ అధికార జేడీయూ, ఆర్జేడీకి 41శాతం, బీజేపీకి 46శాతం ఓట్లు వచ్చాయి.
*మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమికి 52శాతం ఓట్లతో తిరుగులేదు.
*గుజరాత్ లో మరోసారి బీజేపీదే అధికారం, రాజస్తాన్ లోనూ 46శాతం ఓట్లతో బీజేపీదే అధికారం అని తేలింది.
*యూపీలో మరోసారి యోగి 49శాతం ఓట్లతో అధికారంలోకి వస్తారని తేలింది. మధ్యప్రదేశ్ లోనూ 52శాతం ఓట్లతో బీజేపీ అధికారం ఖాయమని తేల్చారు.

To Top

Send this to a friend