ఇది గొప్ప సంస్కరణ..

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో బ్యాంకులు కేవలం ఉన్నతవర్గాలు, పారిశ్రామిక వేత్తలకే పరిమితమయ్యాయి. రైతులు, వ్యవసాయదారులు, గ్రామీణ ప్రజానీకానికి , పేద మధ్య తరగతి వర్గాలు వడ్డీ వ్యాపారుస్థుల వల్ల చితికిపోయారు. వారికి విముక్తి కల్పించి సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సదాశయంతో 1969 జూలై 19న బ్యాంకుల జాతీయకరణ చేసి గొప్ప సంస్కరణను దేశంలో చేశారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ.. ఈ జాతీయకరణ వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఆ తరువాత ఈ జాతీయ బ్యాంకులు వాటికి అనుబంధంగా ఆయా రాష్ట్రాల్లో గ్రామీణ బ్యాంకులను నెలకొల్పి మారుమూల ప్రాంతాలలోని గ్రామీణులు, రైతులు, వ్యవసాయదారులకు సేవలను అందించడం ప్రారంభించాయి. ఇలా ఎస్ బీ ఐ సంస్థ.. ఆయా రాష్ట్రాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బికనీర్ అండ్ జైపూర్, మైసూర్, ట్రావెన్ కోర్, పాటియాలా బ్యాంకులుగా విడిపోయింది..

మళ్లీ ఇన్నాళ్లకు మోడీ ప్రభుత్వం గద్దెనెక్కాక ముఖ్యంగా బ్యాంకులు, ఐటీ, ఆర్థిక వ్యవస్థల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఎస్.బీ.ఐని ప్రపంచంలోనే పెద్ద బ్యాంకుగా మలచడానికి దాని అనుబంధ బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయించారు. రెండేళ్లుగా సాగుతున్న ఈ ప్రహసనం ఈ ఏప్రిల్ 1తో ముగిసింది. ఎస్.బీ.హెచ్ బ్యాంకు ఎస్.బీ.ఐలో విలీనం అయ్యింది. ఇక నుంచి ఎస్.బీ.హెచ్ బ్యాంకులన్నీ కూడా ఎస్.బీ.ఐ బ్యాంకులుగా మారి సేవలందిస్తాయి.

మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపుకావడంతో నిన్న ఈరోజు బ్యాంకులు పనిచేయవు.. ఈ రెండు రోజుల్లోనే ఎస్.బీ.హెచ్ సర్వర్ ను ఎస్ బీఐలో కలిపేయడం.. ఎస్ . బీహెచ్ బోర్డులు మార్చేయడం కొనసాగిస్తున్నారు. ఎస్.బీ.హెచ్ ఖాతాదారులకు వచ్చే మూడు నెలల్లో ఎస్.బీ.ఐ పాసుబుక్కులు, చెక్ బుక్కులు దశలవారీగా ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.

To Top

Send this to a friend