మామిడి పండ్లను ఎక్కువగా తింటే లాభమా.. నష్టమా..?

ఏ సీజన్‌లో దొరికే పండ్లు ఆ సీజన్‌లో తింటేనే మజా ఉంటుంది. ఈ వేసవి సీజన్‌లో విరివిగా లభించేవి మామిడిపండ్లు. ఒక్కోరకం ఒక్కోరకమైన రుచి కలిగి ఉంటాయి మామిడిపండ్లు.అందుకే వీటిని పిల్లలు.. పెద్దలు అంతా ఇష్టపడుతారు. అయితే అదేపనిగా మామిడి పండ్లను తింటే ఇబ్బందులూ తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎందుకంటే..?

* మామిడిపండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి.ఒక మోస్తరు మామిడిపండును తినడం వల్ల 135 క్యాలరీలు లభిస్తాయి.ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పండ్లను తినడం వల్ల ఆటోమేటిగ్గా బరువు పెరిగిపోతారట.

* వ్యాయామం తక్కువగా చేసేవాళ్లకు కూడా మామిడి కష్టాలు ఉంటాయట. కాబట్టి రోజూ ఓ అరగంటపాటు వ్యాయామం చేసిన తర్వాతే వాటిని తినాలంటున్నారు.

* మామిడిపండ్లలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువ మోతాదులో తింటే శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పెరిగిపోతాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండటమే మంచిదట.

* ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మామిడిపండ్లు కార్బైడ్ రసాయనం ద్వారా కృత్రిమ పద్ధతిలో మగ్గబెడుతున్నవే.వీటిని ఎక్కువగా తింటే కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం.. లాగడం వంటి సమస్యలు వస్తాయి.

* సరిగా మాగని పండ్లను తినడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. పొట్టలో మంట, సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతారు.పచ్చి మామిడిని ఎంత తక్కువ తింటే అంత మంచిది.

* విపరీతంగా మామిడిపండ్లను తింటే చర్మ అలర్జీ, దురద, సెగ గడ్డలు వంటి సమస్యలు ఏర్పడుతాయి.

To Top

Send this to a friend