చికెన్ , గుడ్లు తింటున్నారా.. రోగాలొస్తాయ్..

 

‘కోళ్ల సంరక్షణ-రవాణాలో అంతర్జాతీయ పోకడలపై’ అధ్యయనం చేసిన లా కమీషన్.. సోమవారం కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖకు ఓ నివేదికను తయారు చేసి ఇచ్చింది. ఇప్పుడా నివేదిక విస్తు గొలుపుతోంది. దేశంలో చికెన్, కోడిగుడ్లు తినే వారికి ముప్పు వాటిల్లుతోందని నివేదికలో పొందుపరిచారు..

నేషనల్ ఎగ్ కౌన్సిల్ తో పాటు ప్రభుత్వం కూడా రోజుకో ‘గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి’ అని చెబుతూనే ఉన్నాయి. గుడ్డు పౌష్టికాహారంగా అంగన్ వాడీల్లో పిల్లలకు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలకు ప్రభుత్వం అందజేస్తోంది. ఇక చికెన్ ను సాధారణ జనం ఎప్పటినుంచో విరివిగా తింటున్నారు. అయితే ఇప్పుడు లా కమిషన్ నివేదికతో ఇవి తినడానికి సందేహించాల్సిందే..

లా కమిషన్ నివేదిక ప్రకారం చీప్ గా దొరుకుతున్న చికెన్, గుడ్లు తింటున్న ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయట.. బాయిలర్, లేయర్ కోళ్లకు పెడుతున్న దాణా పోషకాలు విషతుల్యమైపోతున్నాయట.. యాంటీ బయాటిక్స్ వాడిన దాణాను కోళ్లకు పెట్టడం వల్ల అవి తిన్న జనాలు కూడా ఈ యాంటిబయాటిక్స్ కారణంగా వారి శరీర రోగనిరోధక వ్యవస్థ క్షీణించి రోగాల బారిన పడుతున్నారట.. ఇలా కోళ్లకు పెట్టే విషతుల్య దాణా వల్ల మనం రోగాల బారిన పడుతున్నామని లా కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఇకనైనా కోళ్లకు పెట్టే దాణా విషయంలో నాణ్యత, పరిమాణం నిర్దారించుకోవాలని సూచనలు చేసింది.

To Top

Send this to a friend