స్మార్ట్ ఫోన్ పోయినా ఈజీగా తెలుసుకోవచ్చు..

హైదరాబాద్ వంటి మహానగరంలో ఎక్కువమంది ఉపయోగించేది ఖరీదైన ఫోన్లే. రోజుకు సుమారు వందకు పైగా వారివారి ఫోన్‌లను పోగొట్టుకుంటున్నట్లు సమాచారం. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మరి కొంతమంది పోనీలే అని లైట్‌గా తీసుకుంటున్నారు. యువతులు వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉంటే దొరికిన వ్యక్తి సామాజిక మద్యమాల్లో పోస్ట్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యమైన ఫొటోలు, ఫోన్‌ నెంబర్‌లు ఉంటాయని ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని మనోవేదన చెందుతారు. వీటికి పరిష్కారం ఉందని చాలా మందికి తెలియదనే చెప్పాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని స్మార్ట్‌ ఫోన్‌ను లాక్‌ చేయడంతో పాటు కీలక సమాచారాన్ని తొలగించే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు జీమెయిల్‌ ఐడీ తప్పనిసరిగా అనుసంధానం చేసి ఉండాలి. కంప్యూటర్‌ లేదా మొబైల్‌లో జీమెయిల్‌ ఐడీని ఓపెన్‌ చేయాలి. మెయిల్‌ ఐడీ పేజీలో కుడివైపు మై అకౌంట్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. వెంటనే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో ఫైండ్‌ యువర్‌ ఫోన్‌ అని ఉంటుంది. అక్కడ క్లిక్‌ చేయగానే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మన జీ మేయిల్‌ ఐడీ ఏ ఏ మొబైల్స్‌కి అనుసంధానం చేశామే చూపిస్తుంది. అక్కడ మనం ఉపయోగిస్తున్న మొబైల్‌ను సెలెక్ట్‌ చేయాలి. అకౌంట్‌ వెరిఫై చేయాలని పాస్‌వర్డ్‌ అడుగుతుంది. ఐడీ పాస్‌వర్డ్‌ టైప్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. రింగ్‌, లొకేట్‌ యువర్‌ ఫోన్‌ అని ప్రత్యక్షం అవుతుంది. కుడివైపు రెండు సింబల్స్‌ కనిపిస్తాయి. ఒకటి రింగ్‌, రెండోది మ్యాప్‌ లొకేషన్‌. ఇంట్లోనే ఉంటే రింగ్‌ అప్షన్‌ ఉపయోగించి తెలుసుకోవచ్చు.

ఒకవేళ మీ ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉన్న రింగ్‌టోన్‌ సౌండ్‌ వినిపిస్తుంది. ఎడమ భాగంలో మరిన్ని ఆప్షన్స్‌ ఉన్నాయి. మొబైల్‌ లొకేషన్‌, డివైజ్‌ లాక్‌, కన్సిడర్‌ ఎరైజ్‌ డాటా… అని ఉన్నాయి. మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.

*లొకేషన్‌ తెలుసుకోవచ్చు
స్మార్ట్‌ ఫోన్‌కు అనుసంధానం చేసిన జీ మెయిల్‌ ఐడీ సహాయంతో మీ ఫోన్‌ లొకేషన్‌ ఎక్కడుందో తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది. జీ మెయిల్‌ ఐడీ ఓపెన్‌ చేసిన తర్వాత మై అకౌంట్‌ అనే ఆప్షన్‌ ద్వారా మొబైల్‌ లోకేషన్‌ను తెలుసుకోవచ్చు. దీని కోసం పోలీస్‌స్టేషన్‌, ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.

To Top

Send this to a friend