పూరి వల్లే టాలీవుడ్‌లో డ్రగ్స్‌..!

టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో డ్రగ్స్‌ వాడుతున్న వారు ఉన్నట్లుగా వెళ్లడి అయ్యింది. వారందరు కూడా అరెస్ట్‌ అయ్యేందుకు సిద్దంగా ఉన్నారు. డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకున్న వారు ఇప్పుడు కిందా మీద పడుతున్నారు. స్టార్‌ హీరో రవితేజ కూడా డ్రగ్స్‌ వాడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నోటీసులు అందుకున్న వారిలో రవితేజ ఉన్న కారణంగా అందరి దృష్టి ఇప్పుడు ఎక్కువగా పూరి జగన్నాధ్‌పై ఉంది. టాలీవుడ్‌లో మొదట డ్రగ్స్‌ను కల్చర్‌ను ప్రారంభించింది పూరి అనే వాదన వినిపిస్తుంది.

విదేశాల్లో ఎక్కువ షూటింగ్‌లు చేయడం, ఎక్కువగా విదేశీ పర్యటనలు చేసే పూరి ముందు నుండే డ్రగ్స్‌ను వాడుతూ ఉంటాడు. ఆ అలవాటును మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో తనకు సన్నిహితులు అయిన రవితేజ, సుబ్బరాజు, ఛార్మి, ముమైత్‌ ఖాన్‌, నవదీప్‌ ఇలా పలువురికి అలవాటు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. వీరంత పూరికి సన్నిహితులు అవ్వడం వల్ల వీరు పూరి వల్ల డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని ప్రచారం జరుగుతుంది.

సినీ పరిశ్రమకు చెందిన పలువురికి డ్రగ్స్‌ను అలవాటు చేసిన దర్శకుడు పూరి జగన్నాధ్‌ను ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి అంటూ సినీ ప్రముఖులు మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. పోలీస్‌ విచారణలో పూరి ప్రథమ నిర్థోషి అని తేలితే ఆయనపై కఠినంగా వ్యవహించాలని తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు.

To Top

Send this to a friend