బిగ్‌బాస్‌ షోపై డ్రగ్స్‌ ఇష్యూ ప్రభావం..!

ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం అయిన బిగ్‌బాస్‌ షో పై ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న డ్రగ్స్‌ ఇష్యూ ప్రభావం పడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టాలీవుడ్‌ సెలబ్రెటీల్లో పలువురు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా పోలీసుల విచారణలో వెళ్లడైంది. ఇప్పటికే పలువురు ఆ విషయమై నోటీసులు అందుకున్నారు. పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పోలీసులు పేర్కొనడం జరిగింది. పోలీసుల నోటీసులు అందుకున్న వారిలో ముమైత్‌ ఖాన్‌ ఉన్న విషయం తెల్సిందే.

ఇప్పుడు ముమైత్‌ ఖాన్‌ బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉంది. ఆమెను ఒక వేళ పోలీసులు విచారించాల్సి వస్తే బిగ్‌ బాస్‌ షో నిర్వాహకులను సంప్రదించాల్సి ఉంటుంది. షో నుండి అర్థాంతరంగా ముమైత్‌ బయటకు రావాల్సి ఉంటుంది. అలా జరిగితే షోపై ప్రభావం ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి టాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

డ్రగ్స్‌ వ్యవహారం కాస్త ముందు అయినా కూడా ముమైత్‌ ఖాన్‌ స్థానంలో మరొకరిని ఎంపిక చేసేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముమైత్‌ ఖాన్‌ మొదటి వారం లేదా రెండవ వారంలో ఎలిమినేట్‌ అయితే పర్వాలేదు, లేదంటే ఆమెను పోలీసులు విచారించేందుకు షో నుండి తీసుకు రావాల్సి ఉంటుంది. అలా చేస్తే షో డిస్ట్రబ్‌ అవుతుందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు.

To Top

Send this to a friend