డ్రైవర్లా.? యమ కింకరులా…

 

తమిళనాట ఇద్దరు బస్సు డ్రైవర్లు యమకింకురుల పాత్ర పోషించారు. ఓ సంస్థలో బస్సులో ప్రయాణికులను తీసుకెళ్తూ వివేకం.. విచక్షణ మరిచిపోయి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎవరైనా ఇప్పటివరకు రోడ్డు పై బైక్ రేసులు, కార్ రేసులు చూశాం. కానీ ఆశ్చర్యకరంగా రెండు బస్సులు ఈ రేసులో పోటీపడ్డాయి. అదీ ఓ నేషనల్ హైవేపై ఇద్దరు డ్రైవర్లు పోటీపడి సమానంగా వేగంగా బస్సులను దూసుకుపోనిచ్చారు. రాంగ్ రూట్ లో.. ఎదురుగా వస్తున్న వాహనాలను ఏమాత్రం లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్లు బస్సులను తీసుకుపోయారు.

బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ డ్రైవర్ల చేష్టలు చూసి మొత్తుకుంటున్న బస్సు డ్రైవర్లు లెక్కచేయలేదు. పక్కడన రోడ్డు పనులు జరుగుతున్న ఆ దుమ్ము దూళిపైనే వేగంగా పోనిచ్చారు. ఈ రెండు బస్సుల వెనుక బైక్ లపై వస్తున్న ఇద్దరు యువకులు వీడియో తీయడంతో ఈ వ్యవహారం వెలుచూసింది. దీనిపై పొలాచి కలెక్టర్ విచారణ జరిపి బస్సు యజమానులను పిలిపించి విచారించారు. బస్సు డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేశారు.

బస్సుల రేసును కింద వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend