గుండెపోటు రాకుండా చేసే జ్యూస్ ఇదే..


యూనివర్సిటీ ఆఫ్ గ్వెల్ఫ్ పరిశోధకులు ఇటీవల గుండెపోటు రాకుండా ఉండేందుకు చేసిన పరిశోధనలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఎవరైతే అధిక రక్తపోటు, గుండెపోటు సమస్యతో బాధపడుతున్నారో వారు ప్రతిరోజు బీట్ రూట్ జ్యూస్ తాగితే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని మరోసారి ప్రయోగాత్మకంగా పరిశోధించి తేల్చిచెప్పారు.

బీట్ రూట్ లో ఉండే నైట్రేట్ రక్తనాళాల వ్యాసాన్ని పెంచుతుందని పరిశోధనలో తేల్చారు. ఫలితంగా రక్తపోటు తగ్గిపోతుందన్నారు. బీట్ రూట్ తాగడం వల్ల సింపథెటిక్ నాడీ వ్యవస్థ పైనా ప్రభావం చూపిస్తుందట.. ఈ మేరకు 20 మంది వలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారట..

శాస్త్రవేత్తలు మొదట ఈ పరిశోధన కోసం 20 మంది యువకులను రెండు గ్రూపులుగా విభజించారట.. ఒక గ్రూపులోని సభ్యులకు ఒక నైట్రేట్ సప్లిమెంటును (బీట్ రూట్ రసాన్ని), మరో గ్రూపు వారికి మాత్రలు అందజేశారు. ఈ పరీక్షకు ముందు, తర్వాత పరీక్షలు జరిపారు. అనంతరం బీట్ రూట్ రసాన్ని తాగిన వారికి రక్తపోటు తగ్గిపోవడం జరిగిందని తేల్చారు. ఇలా బీట్ రూట్ రసం తాగితే గుండెపోటు రాదని స్పష్టం చేశారు.

To Top

Send this to a friend