దాసరి మరణంపై ఆయన కోడలికి అనుమానాలు..!


దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతిపట్ల సినీ పరిశ్రమ, రాజకీయ వర్గానికి చెందిన ప్రముఖులు అంతా కూడా సంతాపం తెలుపుతున్నారు. దాసరితో సాన్నిహిత్యం ఉన్నవారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ సమయంలోనే దాసరి కుటుంబంలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. గత కొంత కాలంగా దాసరి పెద్ద కొడుకు, కోడలు మద్య విభేదాలు ఉన్నట్లుగా వెళ్లడైంది. దాసరి పెద్ద కోడలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు ప్రస్తుతం అందరికి షాక్‌ ఇస్తున్నాయి. మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. నా భర్తతో నేను విడాకులు తీసుకోలేదు. మామగారి మరణం వెనుక అనుమానాలు ఉన్నాయి అంటూ ఆమె చెస్తున్న వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతున్నాయి.

దాసరి పెద్ద కోడలు మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల తాను భర్తతో దూరంగా ఉంటున్నాను అని, ఇటీవలే మామగారిని కలిశాను, మీకు అన్యాయం చేయను అన్నారు. ఆస్తిలో వాట ఇస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఎంతో మందికి జీవితం ఇచ్చిన నేను మీకు అన్యాయం చేయను అంటూ హామీ ఇవ్వడం, ఆ తర్వాత కొన్ని రోజులకే ఇలా జరగడం నాకు అనుమానంగా ఉందని ఆమె మీడియా ముందు మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. ఆమె మాటల ప్రకారం ఆమె కొడుకులే ఆమెను చంపి ఉంటారు అనే అనుమానం వ్యక్తం అవుతుంది. పోలీసులకు కూడా ఈ విషయమై ఫిర్యాదు చేస్తాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

To Top

Send this to a friend