ఈ బుడతడు మామూలోడు కాదు..

వాటిని చూస్తేనే సగం చస్తారు. పెద్దవాళ్లకు సైతం కుక్కలంటే భయం.. పైగా అర్ధరాత్రి ఒంటరిగా వెళుతుండగా కుక్కలు చుట్టుమడితే పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఈ ఐదేళ్ల బుడ్డోడు మాత్రం వీధికుక్కలు తనను రౌండప్ చేసినా కూడా చాకచక్యంగా వాటిని బెదరించి.. అదిరించి వెళ్లగొట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వీడియో వైరల్ లా పాకుతోంది.

హైదరాబాద్ మూసాపేట్ లోని ఆంజనేయనగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.. ఓ పెళ్లికి వచ్చిన బాలుడు.. అతడితో పాటు ఓ బాలిక కాలనీలో నడుచుకుంటూ వెళుతుండగా.. కుక్కలు అటాక్ చేశాయి. బాలిక పారిపోగా.. బాలుడి చుట్టూ మూడు కుక్కలు రౌండప్ చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద వాళ్లు సైతం ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే.. కానీ ఆ బుడతడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు.   ఆ బాలుడు చూపిన తెగువను అందరూ మెచ్చుకుంటున్నారు.. చేతిలో ఏమీ లేకున్నా ధైర్యంగా ఉత్త చేతులతో కుక్కలను అదిలించి బెదిరించి ఒక్క కాటు కూడా లేకుండా అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ బాలుడి ధైర్య సాహసాలను   ఆ వీధిలో  ఒకరి ఇంటిపై ఉంచిన సీసీ కెమెరా చిత్రించింది.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన కృష్ణ కుటుంబం మూసాపేటలోని బస్తీలో బతుకుదెరువు కోసం వచ్చి నివాసం ఉంటోంది. కృష్ణ కొడుకు చందు ఓ పెళ్లి కార్యక్రమంలో భాగంగా   వీధిలో వెళుతుండగా కుక్కలు రౌండప్ చేశాయి. బాలుడు  ధైర్యంగా వీధికుక్కలను తరిమివేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
బాలుడు కుక్కలను ఎదుర్కొన్న వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend