ఆ ఆపరేషన్ వద్దంటున్న వైద్యులు!


బేరియాట్రిక్ సర్జరీ.. దాసరి నారాయణ రావు అధిక బరువును నియంత్రించడానికి చేసుకున్న శస్త్రచికిత్స వికటించి ఆయన ప్రాణాలనే బలితీసుకుంది. ఇదే సర్జిరీని చేయించుకొని అప్పట్లో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కూడా ప్రాణాలు కోల్పోయింది. సర్జరీ తర్వాత తలెత్తే కాంప్లికేషన్స్ ను నియంత్రించడం వైద్యుల వైఫల్యం వారి ప్రాణాలను తీస్తోంది. బరువు తగ్గడం పక్కా కానీ దానివల్ల దుష్ఫరిణామాలు మాత్రం ఎక్కువగా ఉంటున్నాయి.

అప్పట్లో దాసరి అధిక బరువుతో బాధపడుతుండేవాడు. వైద్యులను సంప్రతించగా ఆయనకు బేరియాట్రిక్ సర్జరీ చేశారు. ఇందులో ఆపరేషన్ , బాడీ కోసేయడం ఏమీ ఉండదు. అంతా ఎండోస్కోపి (చిన్న రంధ్రం గుండా యంత్రాలను లోపలకు పంపే చికిత్స) ద్వారా చేస్తారు. దాసరి జీర్ణాశయంలోకి బరువు తగ్గించేందుకు నోటి ద్వారా గ్యాస్ట్రిక్ బెలూన్ ను అప్పట్లో పంపారు. ఈ సిలికాన్ బెలూన్ ను చిన్న గొట్టానికి అమర్చి అందులో సెలైన్ నింపి జీర్ణకోశంలో ఉంచుతారు. ఇది జీర్ణాశయంలో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించి పొట్ట నిండి ఆకలి తీరిన అనుభూతి కలుగుతుంది. తద్వారా కొవ్వు కరిగి సన్నబడతారు. దాసరికి ఇదే చికిత్స జరిగింది. అప్పట్లో బరువు తగ్గారు కూడా.. కానీ ఇదే ఆయన ప్రాణాలు తీసింది.

దాసరికి నోటి ద్వారా సర్జరీ పరికరాల పంపినప్పుడు శ్వాసనాళం.. తినే అన్నవాహికకు డ్యామేజ్ జరిగింది. వాటికి రంద్రాలు పడి సర్జరీకి దారి తీసింది. దీంతో ఆహారం తీసుకోకుండా దాసరి సుష్కించిపోయారు. ఇలా బరువు తగ్గిందుకు చేసుకున్న చికిత్స వల్ల అన్నవాహిక గొట్టం దెబ్బతిని గుండెపోటుకు కారణమై దాసరి చనిపోయారట..

ప్రస్తుతం టాలీవుడ్ తోపాటు ఎంతో మంది మరణానికి కారణమవుతున్న బేరియాట్రిక్ సర్జిరీని చేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లు తీవ్రంగా ఉండి దుష్ఫరిణామాలు సంభవిస్తున్నాయని.. యోగా, వ్యాయామాల వల్లనే బరువు తగ్గాలని సూచిస్తున్నారు.

To Top

Send this to a friend