రంజాన్‌కు పవన్‌ ఇచ్చేదేంటో తెలుసా?


పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అవ్వడంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల వారిలో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తప్పకుండా ఇదో భారీ బ్లాక్‌ బస్టర్‌ అవ్వడం ఖాయం అని, వీరిద్దరు హ్యాట్రిక్‌ను దక్కించుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమా టైటిల్‌ ఏంటి, పవన్‌ ఎలా ఉండబోతున్నాడు అనే విషయాలపై ఫ్యాన్స్‌ చాలా ఆతృతగా ఉన్నారు.

సినిమా షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయ్యింది. ఈ సమయంలోనే చిత్ర టైటిల్‌ను ప్రకటించాలని అలాగే పవన్‌ ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయాలని త్రివిక్రమ్‌ నిర్ణయించుకున్నాడు. అందుకోసం రంజాన్‌ పర్వదినంను ఎంచుకున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రంజాన్‌ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల మూవీ టైటిల్‌ అనౌన్స్‌ చేయడంతో పాటు పవన్‌ సాఫ్ట్‌వేర్‌ లుక్‌ను కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాటమరాయుడు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోవడంతో పవన్‌ కాస్త కసితో ఈ సినిమాను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్‌, త్రివిక్రమ్‌ల మూవీ అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. వెంకీ ఈ చిత్రంలో గెస్ట్‌ రోల్‌ను పోషిస్తుండగా కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

To Top

Send this to a friend