అంబానీ ఫోన్ రేట్ ఎంతో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవానాన్ని ముఖేష్ ఏరీకోరి భార్య, పిల్లల కోసం నిర్మించుకున్నారు. దీనికోసం దాదాపు 12,500 కోట్లు ఖర్చు పెట్టాడు. మొత్తం బుల్లెట్ ఫ్రూవ్ గ్లాస్, గోడలనే నిర్మించేశాడు. ఈ 27 అంతస్థుల ముంబైలోని అంటిలియా భవనంలో ముఖేష్ ప్రస్తుతం నివసిస్తున్నారు. ఇందులో థియేటర్లు, స్టూడియోలు, జిమ్ లు, స్విమ్మింగ్ ఫూల్ లు, శ్రీకృష్ణ మందిరం, మూడు హెలీప్యాడ్ లున్నాయట.. ఇందులో పార్కింగ్, గ్యారేజీ కోసమే ఆరు అంతస్థుల్లో నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాడంటే ఈ కోటీశ్వరుడి స్టామినా అర్థం చేసుకోవచ్చు.. ఇక ఆయన కారు విలువ 25 కోట్లు.. ప్రత్యేకించి భారీ సెక్యూరిటీ ఫీచర్స్ తో సొంతంగా దాన్ని తయారు చేయించుకున్నాడు. ఇక తన ఇంట్లో కార్లు పెట్టుకోవడానికే ఏకంగా ఒక ఫ్లోర్ ను ఏర్పాటు చేశాడీ కుబేరుడు..

ఇప్పుడు దేశాన్ని డిజిటల్ మయం చేయడానికి దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు ముఖేష్ అంబానీ. జియోను రంగ ప్రవేశం చేయించి అప్పటివరకు ఉచితంగా కాల్స్, డేటా సేవలను అందించి అబ్బురపరిచారు. ఇప్పుడు జియో మేనియాకు అందరూ గులాం అవుతున్నారు. ఇంత కుబేరుడైన ముఖేష్ అంబానీ జియో రావడానికి ముందు వాడిన నెట్ వర్క్ ఎయిర్ టెల్ అట.. ఆ తర్వాత తాను పెట్టిన జియోకు మారాడు.

అయితే ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ వాడే ఫోన్లు ఎలాంటివి..? ఎంత ఖరీదు చేస్తాయనే ఆసక్తి అందరిలోనూ ఉంది.. ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత సెక్యూరిటీ ఫీచర్స్ గల కెనెడా మొబైల్ దిగ్గజం బ్లాక్ బెర్రీ ప్రత్యేకంగా తయారు చేసిన ఫోన్ నే వాడుతారట.. ఇది ముకేష్ ఒక్కరి వద్దనే ఉందట.. దీన్ని ఎవ్వరూ హ్యాక్ చేయడానికి వీల్లేకుండా ఉంటుందట.. ఇక ఆయన భార్య నీతా అంబానీ ఫోన్ రేట్ తెలిస్తే షాక్ అవుతారు.. ఆమె ఫోన్ ఖరీదు అక్షరాలా 312 కోట్లు. దానిపేరు ప్రఖ్యాత ఫాల్కన్ సూపర్ నోవా ఐఫోన్ 6. దీనికలర్ గోల్డ్. వెనుకలా పింక్ కలర్ డైమండ్ అమర్చారు.. ఈ ఫోన్ ఆర్డర్ ఇచ్చి మరీ మొత్తం బంగారం,వజ్రాలతో ప్రత్యేకంగా తయారు చేయించిందట… ఇలా అంబానీలు లక్షల కోట్ల ఆస్తి పరులే కాదు.. తమ ఫోన్లను కూడా వందలకోట్లు పెట్టి తయారు చేయించుకొని వాడుతుండడం విశేషం.

To Top

Send this to a friend