ఎన్టీఆర్‌ ‘బిగ్‌బాస్‌’ షో ఎలా ఉంటుందో తెలుసా?


హిందీలో కౌన్‌ బనేగా కరోడ్‌ పతి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అతి పెద్ద రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇప్పటి వరకు పది సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో చాలా సంవత్సరాలుగా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తూనే ఉంది. ఇప్పుడు అదే టైటిల్‌తో తెలుగులో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా స్టార్‌ మాటీవీలో ప్రసారం కాబోతుంది. తెలుగు ప్రేక్షకుల్లో బిగ్‌బాస్‌ షో పేరు వినడమే కాని, అది ఎలా ఉంటుందో ఒక క్లారిటీ లేదు.

బిగ్‌ బాస్‌ షోలో భాగంగా కొంత మంది సెలబ్రెటీలు మరియు సాదారణ వ్యక్తులను కొన్ని రోజుల పాటు ప్రత్యేకంగా నిర్మించిన ఒక ఇంట్లో ఉంచుతారు. ఆ ఇంట్లో అన్ని వసతులు కల్పిస్తారు. అయితే మొబైల్‌, నెట్‌, టీవీ ఇలాంటివి మాత్రం అందుబాటులో ఉండవు. ఆ ఇంట్లో కొన్ని రోజుల పాటు వారిని ఉంచుతారు. వారి ప్రతి కదలిక సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తారు. కొందరు మద్యలో వెళ్లి పోవడం, కొందరు అక్కడ పరిస్థితులకు తట్టుకోలేక ఇబ్బంది పడటం ఉంటుంది. అలా సెలబ్రెటీలు, సాదారణ వ్యక్తుల మద్య జరిగే ఆక్తికర సంఘటనలు షోలో హైలైట్‌గా నిలుస్తాయి.

ఇక తెలుగు బిగ్‌బాస్‌ షోకు వస్తే కేవలం సెలబ్రెటీలు మాత్రమే పాల్గొనబోతున్నారు. సెలబ్రెటీల మద్య జరిగే సంఘటనలు, వాటికి కాస్త డ్రామా యాడ్‌ చేసి కార్యక్రమంను నడిపంచనున్నారు. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వారిని నడిపిస్తూ ఉంటాడు. తెలుగు వారి మనోభావాలు దెబ్బ తినకుండా కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అంటే హిందీకి తెలుగుకు కాస్త తేడా ఉండే అవకాశం ఉంది. బిగ్‌ బాస్‌ షోలో అప్పుడు అశ్లీలం ఎక్కువ అయ్యిందనే టాక్‌ వచ్చింది. తెలుగులో మాత్రం అలా ఉండకుండా జాగ్రత్త పడనున్నారు.

To Top

Send this to a friend