వచ్చే సంవత్సరం మరో ‘డీజే’

వరుస విజయాలతో దూసుకు పోతున్న అల్లు అర్జున్‌ తాజాగా నటించిన చిత్రం ‘డీజే’. తన గత చిత్రాలకు పూర్తి విరుద్దంగా ఒక స్టైలిష్‌ అయ్యగారిగా అల్లు అర్జున్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో బన్నీ సూపర్‌ అనిపించుకున్నాడు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి అవుతున్నాయి. ఈ సమయంలోనే అల్లు అర్జున్‌ మరో డీజేకు కూడా ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

‘డీజే’ సినిమా ఇంకా విడుదల కాకుండానే దర్శకుడు హరీశ్‌ శంకర్‌ దీనికి సీక్వెల్‌గా ఒక కథను సిద్దం చేసినట్లుగా చెబుతున్నారు. ఆ స్టోరీ లైన్‌కు అల్లు అర్జున్‌ ఓకే చెప్పడం కూడా జరిగి పోయింది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌తో తెరకెక్కిన ‘డీజే’ సినిమా సూపర్‌ హిట్‌ అయితే తప్పకుండా సీక్వెల్‌ను వచ్చే సంవత్సరంలో చేద్దామంటూ హరీష్‌ శంకర్‌కు అల్లు అర్జున్‌ మాట ఇచ్చినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రంలోని లుక్‌కు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల వారు, ప్రేక్షకులు అంతా కూడా ఫిదా అవుతున్నారు. తప్పకుండా సినిమా సక్సెస్‌ అవుతుందని, దాంతో సీక్వెల్‌ కూడా రావడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు. ‘డీజే’ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా ముద్దుగుమ్మ పూజా హెగ్డే రొమాన్స్‌ చేసిన విషయం తెల్సిందే. బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా ఈ సినిమా నిలుస్తుందని మెగా ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. మరి అంచనాలను అందుకుంటుందా అనేది చూడాలి.

To Top

Send this to a friend