‘డీజే’ ట్రైలర్‌ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే..!

అల్లు అర్జున్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీజే’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు, ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ సినిమా స్థాయిని ఆకాశంలో నిలిపాయి. ఇక తాజాగా ట్రైలర్‌ విడుదల తర్వాత ఆ స్థాయి మరింతగా పెరిగింది. బన్నీకి మరో సక్సెస్‌ పడటం ఖాయం అని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ‘డీజే’ టీజర్‌ చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపిస్తుంది.

ఈ టీజర్‌లో బన్నీ అయ్యవారిగా కనిపించడంతో పాటు ఒక స్టైలిష్‌ మాఫియా డాన్‌గా కూడా కనిపిస్తున్నాడు. దాంతో ఇప్పుడు ఈ సినిమాలో బన్నీ డబుల్‌ రోల్‌లో నటించాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశాల్లో మాఫియా నిర్వహించే ఒక అల్లు అర్జున్‌, ఇండియాలో వేడుకల్లో వంటలు చేయించే అయ్యగారికి ఏం సంబంధం, ఇద్దరికి మద్య కనెక్షన్‌ ఎలా కలుస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికర విషయం. ఒకే వ్యక్తి ఏదో కారణంగా అలా మారాడా అనేది సినిమా విడుదల అయితే కాని తేలదు. మొత్తానికి ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

అల్లు అర్జున్‌ ఈ సినిమా ప్రత్యేకంగా కనిపించడం కోసం దాదాపు అయిదు కేజీల బరువు తగ్గినట్లుగా తెలుస్తోంది. అయ్యగారి పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక భాష విషయంలో కూడా బన్నీ ప్రత్యేకమైన శ్రద్దను కనబర్చినట్లుగా తెలుస్తోంది. దిల్‌రాజు బ్యానర్‌లో ఈ సినిమా 25వది. దాంతో కూడా అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. బన్నీ కెరీర్‌లో ఇది రికార్డు బ్రేకింగ్‌ చిత్రం అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు.

To Top

Send this to a friend