“డీజే” రివ్యూ

‘డీజే దువ్వాడ జగన్నాథమ్‌’ రివ్యూ
చిత్రం : డీజే
రేటింగ్‌ : 2.75/5.0
బ్యానర్‌ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌
దర్శకుడు : హరీష్‌ శంకర్‌
నిర్మాత : దిల్‌రాజు
విడుదల : జూన్‌ 23, 2017

స్టారింగ్‌ : అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, తనికెళ్ల భరణి, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, చంద్ర మోహన్‌, మురళి శర్మ తదితరులు

వరుసగా భారీ బ్లాక్‌ బస్టర్‌లు సాధిస్తూ వస్తున్న అల్లు అర్జున్‌ ఈ చిత్రంతో మరోసారి సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం అంటూ మొదటి నుండి మెగా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. హరీష్‌ శంకర్‌ తనదైన శైలిలో ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టీజర్‌ మరియు ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పాడ్డాయి. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా అనేది ఈ రివ్యూలో చర్చిద్దాం.

కథలోకి వెళితే :
దువ్వాడ జగన్నాథమ్‌(అల్లు అర్జున్‌) వంట మాస్టర్‌. శుభకార్యల్లో డీజే వంటలు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే అనుకోకుండా పూజా(పూజా హెగ్డే)ను కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు, ఆమె కూడా డీజేను ప్రేమిస్తుంది. ఆ సమయంలోనే బ్రహ్మణ సంఘంకు చెందిన కోట్ల ఆస్తులను నాయుడు(రావు రమేష్‌) కాజేసే ప్రయత్నం చేస్తాడు. అదే ల్యాండ్‌ కోసం విలన్‌ విదేశాల నుండి కొందరు మనుషులను పంపిస్తాడు. ఆ మనుషులతో పోరాడిన డీజే విదేశాలకు వెళ్లి అసలైన విలన్‌ను డీ కొడతాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ బ్రహ్మణ సంఘం ఆస్తును డీజే ఎలా కాపాడాడు అనేది కథాంశం.

నటీనటుల ఫర్ఫార్మెన్స్‌ :
అల్లు అర్జున్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు విభిన్న గెటప్స్‌లలో కనిపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బ్రహ్మణ యువకుడిగా బన్నీ నటించి మెప్పించాడు. డైలాగ్‌ డెలవరీ మరియు ఎక్స్‌ ప్రెషన్స్‌, ఫైట్స్‌, అలాగే హీరోయిన్‌తో రొమాన్స్‌ ఇలా అన్ని విధాలుగా కూడా బన్నీ ‘డీజే’ పాత్రలో ఒదిగి పోయి నటించి సినిమాకు హైలైట్‌ అయ్యాడు. హీరోయిన్‌ పూజా హెగ్డే తన పాత్ర పరిధిలో నటించి మెప్పించింది. తన అందాలతో సినిమాకు ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. బన్నీతో ఈ అమ్మడు చేసిన రొమాన్స్‌ అదుర్స్‌. ఇక రావు రమేష్‌ తన తండ్రి రావు గోపాల్‌ రావ్‌ను గుర్తుకు తెచ్చాడు. కామెడియన్స్‌ మెప్పించారు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధిలో ఆకట్టుకున్నారు.

సాంకేతికపరంగా:
సినిమా విడుదలకు ముందే దేవిశ్రీ సక్సెస్‌ అయ్యాడు. సినిమాలోని పాటలు అన్ని కూడా మాస్‌, క్లాస్‌ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలు మినహా అంతా బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చక్కగా ఉంది. సినిమాను కలర్‌ఫుల్‌గా సినిమాటోగ్రఫర్‌ చూపించాడు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ కథపై మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది, స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:
అల్లు అర్జున్‌ సినిమా అనగానే ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, మాస్‌ ఎలిమెంట్స్‌ను కోరుకుంటున్నారు. ఈ చిత్రంలో అవి పుష్కలంగా ఉన్నాయి. అయితే కథ రొటీన్‌గా ఉండటంతో పాటు దర్శకుడు స్క్రీన్‌ప్లేను రొటీన్‌గా నడిపించి సినిమా స్థాయి తగ్గించాడు. కథలో ట్విస్ట్‌లు యాడ్‌ చేసి, స్క్రీన్‌ప్లేను మరింత ఆసక్తికరంగా నడిపించి ఉంటే బాగుండేది. అల్లు అర్జున్‌ను దర్శకుడు పూర్తిగా వాడుకున్నాడు. డీజే పాత్రలో అల్లు అర్జున్‌ ఒదిగి పోయిన తీరు బాగుంది. సినిమా ఇంటర్వెల్‌ అదిరింది. సెకండ్‌ హాఫ్‌ పై కాస్త శ్రద్ద పెట్టి ఉండాల్సింది. మొత్తంగా పర్వాలేదు అన్నట్లుగా ‘డీజే’ ఉంది. బన్నీకి మరో సక్సెస్‌గా చెప్పుకోవచ్చు.

ప్లస్‌ పాయింట్స్‌ :
అల్లు అర్జున్‌,
పూజా హెగ్డే,
సంగీతం,
కామెడీ సీన్స్‌,
రావు రమేష్‌

నచ్చనివి :
కథ, స్క్రీన్‌ప్లే,
సెకండ్‌ హాఫ్‌

చివరగా :
ఫ్యాన్స్‌ను మెప్పించిన ‘డీజే’.

To Top

Send this to a friend