‘డీజే’ ప్రీమియర్‌ షో టాక్‌


అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కి, విడుదలకు ముందు పలు వివాదాలను మూటకట్టుకుని, ఆ కారణంగా మరింతగా పబ్లిసిటీ దక్కించుకుని, అంచనాలు మరింతగా పెరగడంతో భారీగా విడుదలైన ‘డీజే’ చిత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంటుంది. యూఎస్‌లో అత్యధిక లొకేషన్స్‌లో ఈ చిత్రం విడుదలైంది. సినిమాపై వచ్చిన అంచనాల నేపథ్యంలో ఊహించని విధంగా అడ్వాన్స్‌ బుకింగ్‌ అయ్యింది.

ఇక యూఎస్‌లో ప్రీమియర్‌ షో చూసిన ప్రేక్షకులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇంటర్వెల్‌కు ముందు సీన్స్‌ అదిరిపోయాయి అంటున్నారు. పాటలు మరియు అల్లు అర్జున్‌ స్టైలిష్‌ లుక్‌ ఆకట్టుకున్నాయంట. ప్రస్తుతం బర్నింగ్‌గా ఉన్న ల్యాండ్‌ మాఫియా, భూ కుంభకోణాపై ఈ చిత్ర కథ నడుస్తుంది. దాంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతున్నారు.

కథ కాస్త రొటీన్‌గానే ఉన్నా కూడా దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో నడిపించి మెప్పించాడంటూ ప్రేక్షకులు అంటున్నారు. ఈ చిత్రంతో బన్నీ మరోసారి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం అని, దిల్‌రాజు ఖాతాలో మరో విజయం పడ్డట్లయ్యిందని ప్రేక్షకులు అంటున్నారు.

‘డీజే’ పూర్తి రివ్యూ మరి కాసేపట్లో మీ ముందుకు తీసుకు వస్తాం..

To Top

Send this to a friend