టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ప్రతి శుక్రవారం సినిమాలు రావడం చాలా కామన్. ఒక్కో వారం రెండూ ముడు చిత్రాలు కూడా వస్తాయి. అయితే కొన్ని వారాల్లో ఏమాత్రం గుర్తింపు లేనివారు, అంచనాలు లేకుండా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఈ వారం కూడా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాయి. కాని ఈ మూడు చిత్రాల్లో ఒక్క సినిమా అయినా ఆడుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో లేదు.
మూడు సినిమాల్లో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘జయదేవ్’. ఏపీ మంత్రి గంట శ్రీనివాసరావు తనయుడు రవితేజ నటించిన చిత్రం ‘జయదేవ్’. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. పెద్దగా అంచనాలు లేకుండానే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రెండవ సినిమా సంపూ ‘వైరస్’. ఇది ఒక వర్గం ప్రేక్షకుల వరకు మాత్రమే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక కామన్ ప్రేక్షకుడు వైరస్‌ను చూడాలని ఆసక్తి చూపించడు. దాంతో వైరస్ కూడా ఈ వారం పెద్దగా ప్రభావం చూపుతుందని భావించడం లేదు. ఇక చివరగా ‘ఖయ్యూం భాయ్’. ఈ సినిమాపై కూడా అంచనాలు లేవు.
ఈ మూడు సినిమాలు కూడా ఆడుతాయన్న నమ్మకం లేదు. అలాగే ఆ సినిమాలను చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో లేదు. దాంతో గత వారం విడుదలైన ‘డీజే’ మరో వారం రోజుల పాటు దుమ్ము దులపడం ఖాయంగా చెబుతున్నారు. ఇప్పటికే వంద కోట్ల గ్రాస్‌ను సాధించిన డీజే మరో 25 నుండి 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూళ్లు చేస్తుందేమో చూడాలి. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒడ్డున పడ్డట్లుగా సమాచారం అందుతుంది. మరో వారం పాటు సందడి కొనసాగనున్న నేపథ్యంలో భారీ లాభాలు ఖాయంగా దిల్‌రాజు అభిప్రాయ పడుతున్నాడు.
