డీజే’ ఆ రెండు సినిమాలకు కాపీ


అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీజే’ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమాపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఎన్టీఆర్‌ ‘అదుర్స్‌’ మరియు ఉపేంద్ర ‘బ్రహ్మణ’ చిత్రాలకు కాపీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బ్రహ్మణ సినిమాను ఉన్నది ఉన్నట్లుగా దించినట్లుగా టాక్‌ వినిపిస్తుంది. ‘బ్రహ్మణ’ చిత్రంలో ఉపేంద్ర రెండు విభిన్న పాత్రలో కనిపించాడు. ఒకటి బ్రహ్మణుడిగా ఒకటి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు.

ఈ చిత్రంలో కూడా అల్లు అర్జున్‌ రెండు విభిన్న పాత్రల్లో నటించినట్లుగా ట్రైలర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. అప్పట్లో బ్రహ్మణ సినిమా పెద్ద దుమారంను రేపింది. బ్రహ్మణుల ఆగ్రహంకు గురైంది. ఇప్పుడు అదే తరహా కథాంశంతో డీజేను తెరకెక్కించడంతో అంతా అవాక్కవుతున్నారు. ఇక అదుర్స్‌ సినిమాలో కూడా ఎన్టీఆర్‌ రెండు విభిన్న పాత్రల్లో నటించాడు. ‘డీజే’ ట్రైలర్‌ చూడగానే వెంటనే ‘అదుర్స్‌’ మరియు ‘బ్రహ్మణ’ చిత్రాలు కళ్ల ముందు మెదులుతున్నాయి.

సినిమా విడుదల తర్వాత ఈ సినిమా ఎంతటి దుమారం రేపుతుందో అని సినీ ప్రముఖులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకణ చివరి దశలో ఉంది. ఈనెల 23న విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇటీవలే విడుదలైన పాటలోని కొన్ని పదాలు బ్రహ్మణులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఉద్దేశ్యంతో ఆ పదాలను తొలగించడం జరిగింది. సినిమాలో ఇంకా ఎన్ని తొలగింపులు ఉంటాయో చూడాలి.

To Top

Send this to a friend