డీజేను చూసైనా బాలీవుడ్ కళ్లు తెరవాలి..

ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ డీజే సీనిమా వసూళ్లను చూసి ఆశ్చర్యం వక్తం చేశారు. అమెరికా, కెనెడాల్లో ఈ సినిమా వసూళ్లు బాలీవుడ్ అగ్రహీరో ట్యూబ్ లైట్ కంటే కూడా ఎక్కువ అని ట్వీట్ చేశారు. దీంతో అంతటా సంచలనం రేగింది..

అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఓవర్సిస్ లో మొదటిరోజు భారీగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తరుణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. డీజే మొదటిరోజు రూ.3.39 కోట్లు అమెరికాలో వసూలు చేసిందని.. కెనడాలో రూ.4 కోట్లు వసూలు చేసిందని ట్వీట్ చేశారు. ఈ మొత్తం బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ట్యూబ్ లైట్ సినిమాకంటే ఎక్కువ అని పేర్కొనడం విశేషం..

అంతేకాదు తరుణ్ ఆదర్శ్ బాలీవుడ్ హీరోలకు, దర్శకులకు హెచ్చరికలు పంపారు. మొన్నటి తెలుగు సినిమా బాహుబలి2, ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ లు ఓవర్సీస్ లో ఇండియన్ సినీ మార్కెట్ ను ఉపయోగించుకొని కోట్లు కొల్లగొడుతున్నాయని.. అదే సమయంలో బాలీవుడ్ హిందీ సినిమాలు తేలిపోతున్నాయని ట్విట్టర్ లో పాల్గొన్నారు. ఇప్పటికైనా బాలీవుడ్ కళ్లు తెరిచి తెలుగులో లాగా సినిమాలు తీయాలని సూచించారు.

To Top

Send this to a friend