టైటిల్ చూసి ఆశ్చర్య పోతున్నారా, అవును నిజంగానే ‘డీజే’ చిత్రాన్నిఓవర్సీస్లో కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ దాదాపు నాలుగు కోట్లనష్టంతో నెత్తిన గుడ్డ ఏసుకునే పరిస్థితి వచ్చింది. ఇటీవల టాలీవుడ్ చిత్రాలు ఓవర్సీస్లో మినిమం రెండు మిలియన్ డాలర్లను వసూళ్లు చేస్తున్నాయి. దాంతో ఈ సినిమా కూడా అంత వసూళ్లు చేస్తే రెండు కోట్లు లాభం దక్కుతుందని ఏకంగా 10 కోట్లకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అయితే సినిమా బ్యాడ్ రివ్యూల కారణంగా ఏకంగా నాలుగు కోట్ల లాస్‌ను డిస్ట్రిబ్యూటర్ బేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దుమ్మురేపుతుండగా ఓవర్సీస్లో మాత్రం కేవలం మిలియన్ డాలర్లను ముక్కి మూలిగి సాధించింది. ఓవర్సీస్ ప్రేక్షకులు ఎక్కువగా రివ్యూలు చూసే సినిమాలు చూస్తారు. రివ్యూలు బాగున్నాయంటేనే వారు సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ప్రేక్షకుల నుండి కాస్త పర్వాలేదు అనే టాక్ వచ్చినా రివ్యూలు మాత్రం ‘డీజే’ ఒక పరమ రొటీన్ చిత్రం అంటూ విశ్లేషించాయి. దాంతో ఓవర్సీస్ ప్రేక్షకులు మరో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఓవర్సీస్లో ప్రేక్షకుల అభిరుచి చాలా విభిన్నంగా ఉంటుంది. చూసేది సినిమాలు చాలా అరుదుగా, అందుకే చూసిన సినిమా అయినా మంచి సినిమాను చూడాలనేది వారి అభిప్రాయం. అందుకే రివ్యూలు చదివి అన్ని బాగున్నాయనుకున్న తర్వాతే సినిమాకు వెళ్తారు. అందుకే రివ్యూల వల్ల ‘డీజే’ డిస్ట్రిబ్యూటర్ నాలుగు కోట్లు కోల్పోవాల్సి వచ్చింది.
