అల్లు అర్జున్ ‘డీజే’ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది. బన్నీ కెరీర్లోనే అత్యధిక మొదటి రోజు కలెక్షన్స్‌ను సాధించిన చిత్రం ‘డీజే’ నిలిచింది. ‘డీజే’ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా సినిమాపై వచ్చిన అంచనాలు భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చేలా చేశారు. సినిమా ట్రైలర్ అదిరిపోయేలా ఉండటంతో పాటు, సినిమాపై వచ్చిన వివాదాలు కూడా సినిమాపై ఆసక్తిని కలిగించాయి. దాంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు అంతా కూడా ఈ సినిమాపై ఆసక్తి కనబర్చి మొదటి రోజే చూసేందుకు సిద్దం అయ్యారు. అందుకే 33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక రెండవ రోజు ఈ సినిమా 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను మాత్రమే సాధించింది. మూడవ రోజు ఆదివారం అవ్వడంతో మరో 15 కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.
ఏరియా వారిగా మొదటి రోజు గ్రాస్ :
నైజాం : 4.95 కోట్లు
సీడెడ్ : 2.7 కోట్లు
నెల్లూరు : 1.1 కోట్లు
గుంటూరు : 2.26 కోట్లు
కృష్ణ : 1.03 కోట్లు
వెస్ట్ : 2.08 కోట్లు
ఈస్ట్ : 1.86 కోట్లు
వైజాగ్ : 1.95 కోట్లు
ఓవర్సీస్ మరియు ఇతరం : 17.93 కోట్లు
మొత్తం : 33 కోట్లు
