సందీప్ కిషన్ కోసం డైరెక్టర్ వంశీకృష్ణ , రైటర్ ప్రసన్న


తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తోన్న సందీప్ కిషన్ తాజాగా మరో నూతన చిత్రానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. ‘దొంగాట’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ ఈసారి సందీప్ కిషన్ తో ఓ వైవిధ్యమైన పాత్ర చేయించేందుకు ప్లాన్ చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఈ సినిమాకు మోస్ట్ హ్యాపెనింగ్ రైటర్ ప్రసన్నకుమార్ స్టోరీ అందిస్తున్నట్లుగా దర్శకుడు వంశీకృష్ణ ప్రకటించారు. గతంలో ప్రసన్నకుమార్ కథ అందించిన ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ రెండు చిత్రాల మాదిరిగానే సందీప్ కిషన్ ని దృష్టిలో పెట్టుకొని ఓ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీని రెడీ చెసినట్లుగా ప్రసన్న తెలిపారు. ఇక ఈ సినిమాను ‘సినిమా చూపిస్తా మావ’కి నిర్మాతగా వ్యహరించిన రూపేశ్ డి గోహిల్ నిర్మిస్తున్నారు. ‘ఆర్ డి జి ప్రొడక్షన్ ప్రెవైట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ‘నేను లోకల్’, ‘భలే భలే మగాడివోయ్’ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందిందచేందుకు రెడీ అవుతున్నారు. దీంతో పాటు ఈ సినిమాలో హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాత రూపేశ్ డి గోహిల్ తెలిపారు.
బ్యానర్ : ఆర్ డి జి ప్రొడక్షన్ ప్రెవైట్ లిమిటెడ్
నిర్మాత : రూపేశ్ డి గోహిల్
హీరో : సందీప్ కిషన్
దర్శకుడు : వంశీకృష్ణ(దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేమ్)
రైటర్ : ప్రసన్న కుమార్ బెజవాడ(సినిమా చూపిస్తా మావ, నేనులోకల్)
సినిమాటోగ్రాఫర్ : నిజార్ షఫి

To Top

Send this to a friend